సాధారణంగా ఏదైనా పరీక్షకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు అడ్మిట్ కార్డు ప్రింట్ అవుట్ తీసుకొని పరీక్షకు హాజరవుతుంటారు. ఇలాగే ధన్బాద్లోని బినోద్ బిహారి మహ్తో కోయలాంచల్ యూనివర్సిటి ఓ పోస్ట్ గ్రాడ్యుయేషన్ విద్యార్థిని ఆశ్చర్యపోయింది. అడ్మిట్ కార్డు ప్రింట్ తీసుకొని దానిపై ఉన్న ఫోటోను చూసి బిత్తరపోయింది.
Advertisement
Also Read : నారా బ్రాహ్మణి, బాలకృష్ణ కోసం ఇప్పటికీ ఆ పని చేస్తుందట..!!
ధన్బాద్కు చెందిన కాజల్ కుమారి అనే విద్యార్థి గతవారం మంగళవారం అర్థశాస్త్ర పరీక్ష రాయాల్సి ఉంది. అందుకు తన అడ్మిట్ కార్డు కోసం వెళ్ళిన విద్యార్థి అందులో ఉన్న వివరాలను ఒక్కసారి చెక్ చేసుకుంది. తన గురించి పూర్తి వివరాలు సరిగ్గానే ఉన్నాయి.. కానీ తన ఫోటో ఉండాల్సిన స్థానంలో బాలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్యరాయ్ పిక్ చూసి నోరెళ్లబెట్టింది. దీంతో తనను ఎగ్జామ్ రాసేందుకు అనుమతి ఇవ్వరంటూ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ విషయాన్ని యూనివర్సిటీ సిబ్బందికి తెలియజేయగా.. దీనిపై విచారణ ప్రారంభించారు. కేవలం ఇది సాంకేతిక లోపంగానే జరిగినట్లుగా భావిస్తున్నారు. తాను అడ్మిట్ కార్డు కోసం ఫామ్ ఫిల్ చేసినప్పుడు డీటెయిల్స్ సరిగ్గానే ఉన్నాయని.. చివరి నిమిషంలో ఫోటో మారడం పట్ల సిబ్బంది తప్పు అని ఆరోపించింది సదరు విద్యార్థి.
Advertisement
ఇదే విషయంపై యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్ శుక్ దేవ్ మాట్లాడుతూ.. సాంకేతిక కారణాల వల్ల అడ్మిట్ కార్డులో ఇలాంటి పొరపాటు జరిగి ఉంటుంది. దీనిపై విచారణ చేస్తామని.. విద్యార్థినికి పరీక్షకు ఎలాంటి అడ్డంకు రాకుండా చూసుకుంటామని వెంటనే సమస్యను పరిష్కరిస్తామని అన్నారు. మరోవైపు విద్యార్థి ద్వారా సమాచారం తెలుసుకున్న ఏజేఎస్ యూ విద్యార్థి సంఘం అధ్యక్షుడు విశాల్ మహా మాట్లాడుతూ.. యూనివర్సిటీ వెబ్ సైట్ లో తనిఖీ చేయగా, విద్యార్థి చిత్రానికి బదులుగా ఐశ్వర్యరాయ్ బచ్చన్ ఫోటో, సంతకం చేసిన అడ్మిట్ కార్డు జారీ చేయబడింది. ఆ తర్వాత మళ్లీ వెతికితే అక్కడ మరో అడ్మిట్ కార్డ్ కనిపిస్తుంది. అయితే అడ్మిట్ కార్డ్ లో ఐశ్వర్యరాయ్ బచ్చన్ రెండవ చిత్రం ఉంది. యూనివర్సిటీ తప్పిదమా లేక యూనివర్సిటీ వెబ్ సైట్ హ్యాక్ చేయబడిందా అనే విషయంపై విచారణ చేయాలన్నారు.
Also Read : Sr. NTR:ఆమె కోరిక తీర్చడానికే NTR రాజకీయాల్లోకి వచ్చి.. అవమానాలు భరించారా..?