బాలీవుడ్ లో కొందరు హీరోలతో ప్రేమాయణం నడిపిన ఐశ్వర్యారాయ్ చివరికి అమితాబచ్చన్ వారసుడు అభిషేక్ బచ్చన్ ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. 2007వ సంవత్సరంలో వీరి వివాహం అతి సన్నిహితుల మధ్య ఘనంగా జరిగింది. వీరికి 2011లో ఒక పాప పుట్టగా, ఆమెకు ఆరాధ్య అని పేరు పెట్టుకున్నారు. ఒకరకంగా వీరిద్దరిని బాలివుడ్ లో క్యూట్ పెయిర్ గా, చక్కనైన జంటగా వర్ణిస్తూ ఉంటారు అక్కడి అభిమానులు.
READ ALSO : Ravanasura Review : రవితేజ రావణాసుర మూవీ రివ్యూ.. మాస్ మహారాజ్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా..?
Advertisement
అయితే గత కొద్ది రోజుల నుంచి ఐశ్వర్యారాయ్, అభిషేక్ బచ్చన్ ల వైవాహిక జీవితం గురించి బాలీవుడ్ మీడియా కోడైకుస్తుంది. వీరి మధ్య విభేదాలు వస్తున్నాయని, త్వరలోనే వీరు విడాకులు తీసుకోబోతున్నారు అంటూ వార్తలు పుట్టుకొస్తున్నాయి. దీనిపై బచ్చన్ ఫ్యామిలీ నుంచి ఇప్పటివరకు కూడా ఎలాంటి స్పందన రాలేదు. దీంతో వార్తలకు బ్రేక్ పడలేదు. తాజాగా NMACC లో జరిగిన ఘటనతో మరోసారి ఐశ్వర్యారాయ్, అభిషేక్ బచ్చన్ ల విడాకుల విషయం మరోసారి చర్చకు వచ్చింది.
Advertisement
READ ALSO : అబ్బాయిలు ఈ లక్షణాలు కలిగి ఉంటే… అమ్మాయిలు విపరీతంగా ఇష్టపడతారు
నీతా అంబానీ, ముఖేష్ అంబానీ ఇటీవల ఒక కల్చరల్ ఈవెంట్ ను నిర్వహిస్తున్నారు. దీనికి బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు చాలామంది సెలబ్రిటీలు హాజరయ్యారు. ఈవెంట్ కు ఐశ్వర్యరాయ్ కూడా వెళ్ళింది. అయితే ఇక్కడే అసలు సమస్య వచ్చి పడింది ఈవెంట్ లో ఐశ్వర్యారాయ్ తన కూతురు ఆరాధ్యతో మాత్రమే వచ్చింది. పక్కన అభిషేక్ బచ్చన్ లేడు. ఇప్పటికే విడాకుల వార్తలు తెగ వస్తున నేపథ్యంలో NMACC కి వీరు ఇద్దరు కలిసి రాకపోవడంపై అనేక అనుమానాలు వస్తున్నాయి.
READ ALSO : తగ్గేదేలే… పుష్ప 2లో ఆ బాలీవుడ్ స్టార్ హీరో…?