Home » అర‌బిక్ కుత్తు పాట‌కు ఎయిర్ హోస్టెస్ స్టెప్పులు….వీడియో వైర‌ల్..!

అర‌బిక్ కుత్తు పాట‌కు ఎయిర్ హోస్టెస్ స్టెప్పులు….వీడియో వైర‌ల్..!

by AJAY
Ad

త‌మిళ స్టార్ హీరో విజ‌య్ న‌టించిన తాజా చిత్రం బీస్ట్. ఈ సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్ గా న‌టించింది. ఇక ఈ సినిమా నుండి అర‌బిక్ కుత్తు పాట‌ను ఇప్ప‌టికే విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. కాగా ఈ పాట యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. ఈ పాట‌కు ఇప్ప‌టికే ప‌లువురు సెల‌బ్రెటీలు స్టెప్పులు వేసి ఆక‌ట్టుకున్న సంగ‌తి తెలిసిందే.

Advertisement

స‌మంత‌తో పాటూ ప‌లువురు ఈ పాట‌కు డ్యాన్స్ చేసి ఆ వీడియోను సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు. అంతే కాకుండా నెటిజ‌న్లు కూడా ఈ పాట‌కు ఇన్ట్సా లో రీల్స్ చేస్తున్నారు. అయితే తాజాగా స్పైస్ జెట్ ఎయిర్ హోస్టెస్ ముగ్గురు ఈ పాట‌కు స్టెప్పులు వేశారు. రెడ్ క‌ల‌ర్ ఎయిర్ హోస్టెస్ డ్రెస్ లో ముగ్గురు క‌లిసి ఎంతో హుషారుగా ఈ పాట‌కు స్టెప్పులు వేశారు.

Advertisement

ఎయిర్ హెస్టెస్ ఎంతో అంద‌గా స్టెప్పులు వేయడంతో ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది. ఇక ఈ వీడియోను ఎయిర్ హోస్టెస్ ఉమా మీనాక్షి త‌న ఇన్స్టా గ్రామ్ లో షేర్ చేశారు. సూపర్ అంటూ నెటిజ‌న్లు కామెంట్లు పెడుతున్నారు. ఇక ఈ ఒరిజిన‌ల్ సాంగ్ లో కూడా విజ‌య్ మ‌రియు పూజా హెగ్డే ఎంతో జోష్ తో స్టెప్పులు వేశారు.

Visitors Are Also Reading