కాంగ్రెస్ పార్టీ అంటే దేశంలోని అతిపెద్ద జాతీయ పార్టీ. ఈ పార్టీలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఎప్పుడు అంతర్గత కలహాలు మెదులుతూనే ఉంటాయి. ఒక నేత మరో నేత పై విమర్శలు చేసుకుంటూ పబ్బం గడుపుతుంటారు. వీరి చేష్టలతో పంజాబ్ లో ఉన్నటువంటి అధికారం కాస్తా ఊడిపోయింది. ఎంతోమంది బలమైన కార్యకర్తలు ఉన్న ఈ పార్టీకి ఉన్నప్పటికీ నాయకుల లోపం వల్ల కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు దిగజారిపోతోంది. ఇక తెలంగాణ విషయానికొస్తే ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చినా సోనియా తెలంగాణలో పూర్తిగా అధికారాన్ని కోల్పోయింది. రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పేరును కనీసం కాపాడలేకపోయారు ఇక్కడి కాంగ్రెస్ నాయకులు. ఎప్పుడూ ఏదో ఒక అంతర్గత కలహాలతో వార్తల్లో నిలుస్తూ కాంగ్రెస్ అంటే గొడవలు పార్టీ అని ముద్ర వేయించుకున్నారు. ఈ తరుణంలో ఢిల్లీ పెద్దలు సమాలోచనలు చేసి ఎలాగైనా తెలంగాణలో అధికారంలోకి రావాలని యంగ్ అండ్ డైనమిక్ లీడర్ రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్ గా నియమించారు. దీంతో పార్టీ బలపడుతూ వస్తోంది. రేవంత్ రెడ్డి
Advertisement
వ్యూహంతో అసమ్మతి నేతలపై చేస్తూ పార్టీలోకి లాగే ప్రయత్నం చేస్తున్న తరుణంలో, ఆయన ఒక మెట్లు ఎక్కగానే పార్టీలోని సీనియర్ నేతలు మాటలతో నాలుగు మెట్లు కింద కి దించుతున్నారు. దీంతో పార్టీ కార్యకర్తల్లో అసమ్మతి పెరుగుతూ వస్తోంది. ఈ తరుణంలో ఢిల్లీ పెద్దలు గ్రహించి క్రమశిక్షణ చర్యలు కింద మాట వినని వారిని పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోమని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఈ మధ్యకాలంలో ఎమ్మెల్యే జగ్గారెడ్డి కాంగ్రెస్లో అంతర్గత కలహాలతో విపరీతంగా రేవంత్ రెడ్డి పై అసహనాన్ని కక్కుతున్నారు. దీంతో ఢిల్లీ పెద్దలు పిలిచి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. రేవంత్ కు మరింత భరోసా కల్పించారు. ఈ తరుణంలో రేవంత్ నాయకులందరినీ కలుపుకొని ఎలాగైనా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఆలోచనతో ముందుకు వెళుతున్నారు. అయితే మే 7 తేదీన ఉస్మానియా యూనివర్సిటీ రాహుల్ గాంధీ రానున్నారని 6 తేదీన వరంగల్ కాంగ్రెస్ భారీ
Advertisement
బహిరంగ సభకు ఏర్పాటు చేస్తున్నారు. ఈ తరుణంలో అందరు నేతలు ఒక తాటిపైకి వచ్చి రాహుల్ సభను విజయవంతం చేయాలని తీర్మానించుకున్నారు. దీంతో రాహుల్ సభకు ఇన్చార్జి బాధ్యతలను టిపిసిసి కార్యనిర్వహణ అధ్యక్షుడు జగ్గారెడ్డికి అప్పగించినట్టు రేవంత్ రెడ్డి ప్రకటించారు. దీంతో అందరు నేతలు హర్షధ్వానాలు చేశారు. విభేదాలను పక్కనపెట్టి సభను సక్సెస్ చేయాలని తీర్మానం చేసుకున్నారు. దీని అనంతరం జగ్గారెడ్డి మైకు అందుకొని రేవంత్ మరియు ఇతర నేతల ఎదుట ప్రత్యర్థులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు. రాహుల్ పర్యటనకు ఉస్మానియా యూనివర్సిటీ వచ్చినప్పుడు రాజకీయపరమైనటువంటి ఆటంకాలు ఏర్పడవచ్చు. అనే అనుమానాల నేపథ్యంలో జగ్గారెడ్డి వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. అడ్డొస్తే తొక్కిస్తామని హెచ్చరికలు జారీ చేసినట్టు తెలుస్తోంది. మేం తొడగొడితే బీజేపీ, టిఆర్ఎస్ కనబడదని, వెరీ వెరీ సీరియస్ పిసిసి అధ్యక్షుడు చెప్పినట్లు రాహుల్ గాంధీ కచ్చితంగా యూనివర్సిటీకి వస్తారని, ఎన్ని శక్తులు వచ్చిన అడ్డుకోలేరని ఒకవేళ అడ్డుకునే ప్రయత్నం చేస్తే మాత్రం తొక్కి పడేస్తా అంతే అంటూ జగ్గారెడ్డి తీవ్రంగా హెచ్చరించారు.