Home » “ఏజెంట్” ని రిజెక్ట్ చేసిన పాన్ ఇండియా స్టార్… ఎవరా హీరో… ఎందుకు రిజెక్ట్ చేశాడో తెలుసా..?

“ఏజెంట్” ని రిజెక్ట్ చేసిన పాన్ ఇండియా స్టార్… ఎవరా హీరో… ఎందుకు రిజెక్ట్ చేశాడో తెలుసా..?

by AJAY
Ad

టాలీవుడ్ యువ హీరోల్లో ఒకరు అయినటువంటి అక్కినేని అఖిల్ తాజాగా ఏజెంట్ అనే స్పై యాక్షన్ ధ్రిల్లర్ మూవీలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీకి స్టైలిష్ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించగా… మమ్ముట్టి ఈ మూవీలో ఒక కీలకమైన పాత్రలో నటించాడు. ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించగా… ఈ మూవీలో సాక్షా వైద్య హీరోయిన్గా నటించింది.

Advertisement

ఈ మూవీతో ఈ ముద్దుగుమ్మ తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ మూవీకి హిప్ హాప్ తమీజ సంగీతం అందించాడు. ఈ మూవీ భారీ అంచనాల నడుమ కొన్ని రోజుల క్రితమే థియేటర్లలో విడుదల అయింది. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా విడుదల అయిన మొదటి రోజు మొదటి షోకే బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోరమైన నెగటివ్ టాక్ ను తెచ్చుకుంది.

Advertisement

దానితో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర చెప్పుకోదగ్గ కలెక్షన్లను కూడా వసూలు చేయలేక డిజాస్టర్ గా మిగిలింది. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ గా మిగిలిన ఈ సినిమా కథను మొదట ఈ మూవీ బృందం అఖిల్ తో కాకుండా ఒక పాన్ ఇండియా స్టార్ హీరోతో చేయాలి అనుకుందట… ఆ హీరో ఈ మూవీ ని రిజెక్ట్ చేశాడట. ఆ హీరో ఎవరు..? ఈ మూవీ ని ఎందుకు రిజెక్ట్ చేశాడు అనే విషయాలను తెలుసుకుందాం.

ఏజెంట్ మూవీకి సంబంధించిన కొంత భాగం కథ తయారు అయిన తర్వాత ఈ మూవీ కథను దర్శకుడు సురేందర్ రెడ్డి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు వినిపించాడట. ప్రస్తుతం పాన్ ఇండియా మార్కెట్ పై దృష్టి పెట్టిన ప్రభాస్ ఈ సినిమా కథకు పాన్ ఇండియా మార్కెట్ లేదు అనే ఉద్దేశంతో ఈ మూవీ కథను రిజెక్ట్ చేశాడట. దానితో ఇదే కథను అఖిల్ కు చెప్పి ఈ మూవీ బృందం ఒప్పించిందట. అలా ప్రభాస్ తో అనుకున్న మూవీని అఖిల్ తో రూపొందించారట. ఇలా ప్రభాస్ రిజెక్ట్ చేసిన కథతో అఖిల్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోరమైన డిజాస్టర్ ను అందుకున్నాడు.

Visitors Are Also Reading