ప్రతిష్టాత్మక ఆసియా కప్ కి సంబంధించి ఇప్పటికే పలు జట్లు వారి యొక్క టీం లిస్ట్ని చెప్పేశారు ఆసియా కప్ ఆఫ్ఘనిస్తాన్ జట్టుని తాజాగా ప్రకటించారు. మొత్తం 17 మంది సభ్యులతో లిస్ట్ని ఫైనల్ చేశారు. హష్మతుల్లా షాహిది కెప్టెన్గా వ్యవహరిస్తున్నారు. నవీన్ ఉల్ హక్‌కు చోటు మాత్రం దక్కలేదు. విరాట్ కోహ్లీతో ఇదివరకు ఇతను గొడవ పడిన విషయం తెలిసిందే అయితే ఆసియా కప్ లో నవీన్ కోహ్లీ మధ్య ఆసక్తికరమైన పోరు జరుగుతుందని అంతా అనుకున్నారు.
Advertisement
కానీ అతనికి మాత్రం చోటు దక్కలేదు. ఇదిలా ఉంటే ఆరేళ్ల తర్వాత కరీం జనత్ ఆఫ్ఘనిస్తాన్ తరఫున ఆడే అవకాశం మళ్ళీ వచ్చింది. చివరిసారి అతను 2017 లో జింబాబ్వే పై వన్డే మ్యాచ్ లో ఆడాడు ఇప్పుడు మళ్ళీ ఆసియా కప్ తో వస్తున్నాడు. పాకిస్తాన్తో జరిగిన సిరీస్లో ఆడినఫరీద్ అహ్మద్ మాలిక్, షాహిదుల్లా కమల్‌లను జట్టు నుండి తప్పించడం జరిగింది. అలానే చివరి వన్డేలో గాయపడిన అజ్మతుల్లా ఒమర్జాయ్ స్థానంలో గుల్బాదిన్ నైబ్‌ను జట్టులోకి తీసుకోవడం జరిగింది.
Advertisement
ఇక ప్లేయర్స్ లిస్ట్ చూసేయండి.. హష్మతుల్లా షాహిదీ (కెప్టెన్), రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), ఇబ్రహీం జద్రాన్, రియాజ్ హసన్, రహ్మత్ షా, నజీబుల్లా జద్రాన్, మహ్మద్ నబీ, ఇక్రమ్ అలీఖిల్, రషీద్ ఖాన్, గుల్బాదిన్ నాయబ్, కరీం జనత్, ముద్దీన్ అష్రమాన్, అబ్దుల్ రహ్మాన్ రెహమాన్ రెహమాన్, నూర్ అహ్మద్, మహ్మద్ సలీమ్ సఫీ, ఫజల్హాక్ ఫరూఖీ.
Also read:
- జాని మూవీ ఫ్లాప్ తరువాత పవన్ కళ్యాణ్ రియాక్షన్ ఏంటో తెలుసా ?
- బిగ్ బాస్ సీజన్ 7లోకి.. ఆ నటి కూడా.. ఆమె ఎవరంటే..?
- ఎన్టీఆర్ రూ.100 నాణెం.. దీని స్పెషాలిటీ ఏమిటో తెలుసా..?
- రజనీకాంత్ తన కూతురి కోసమే… ఈ డైలాగ్ ని జైలర్ లో పెట్టారా..?