ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురించి స్పెషల్ గా చెప్పాలిన పనిలేదు. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఇప్పుడు పాలనలో దూసుకుపోతున్నారు. దేశంలో ఉన్న 30 మంది ముఖ్యమంత్రుల్లో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అత్యంత ధనవంతుడిగా నిలిచారు. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్, నేషనల్ ఎలక్షన్ వాచ్ అనే సంస్థలు విడుదల చేసిన నివేదికలో ఈ విషయం వెలుగు చూసింది. 30 మంది ముఖ్యమంత్రుల్లో 29 మంది కోటీశ్వరులేనని తేలింది. అయితే పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఒక్కరే నిరుపేద ముఖ్యమంత్రిగా ఏడిఆర్ తెలిపింది. ఆమె ఆస్తుల విలువ కేవలం రూ. 15 లక్షలు అని చెప్పింది.
Advertisement
Advertisement
నివేదిక ప్రకారం ఏపీ సీఎం జగన్ ఆస్తులు విలువ రూ. 510 కోట్లు. ఆ తర్వాత రూ. 163 కోట్లతో అరుణాచల్ ప్రదేశ్ సీఎం పేమ కండు రెండో స్థానంలో నిలిచారు. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ 63 కోట్లతో మూడో స్థానంలో, ఇక తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆస్తుల విలువ రూ.23.55 కోట్లు. బీహార్ సీఎం నితీష్ కుమార్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ల ఆస్తుల విలువ రూ.మూడు కోట్ల పైనేనని నివేదిక తెలిపింది. తమిళనాడు సీఎం స్టాలిన్, కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైల ఆస్తులు రూ. 8 కోట్లని వెల్లడించింది.
ఈ లిస్టులో కేరళ సీఎం పినరయి విజయన్, హర్యానా సీఎం మనోహర్ లాల్ కట్టర్ ల ఆస్తి కోటి పైనే ఉంటుందని తెలిపింది. జాబితాలో మమతా బెనర్జీతో కలిసి వీరిద్దరూ చివరిలో నిలిచారు. అంతేకాదు ఈ 30 మంది ముఖ్యమంత్రుల్లో 13 మందిపై తీవ్రమైన నేరాలు, హ*, హ*యత్నం, కిడ్నాప్ వంటి కేసులు ఉన్నాయని వారే అఫీడవిట్లలో పేర్కొన్నారు. వీటిలో ఏ ఒక్కదానికి కూడా బేయిల్ రాదని, ఐదేళ్లకు పైనే శిక్ష పడుతుందని నివేదిక పేర్కొంది. ప్రస్తుతం ఇది జాతీయ స్థాయిలో కలకలం రేపుతోంది.