Home » ఆదిత్య 369 ఎప్ప‌టికీ మ‌ర్చిపోలేని 10 విష‌యాలు!

ఆదిత్య 369 ఎప్ప‌టికీ మ‌ర్చిపోలేని 10 విష‌యాలు!

by Azhar
Ad

ఆదిత్య 369 ఎవ‌ర్ గ్రీన్ మూవీ! బాల‌య్య మీద అభిమానాన్ని రెట్టింపు చేసిన సినిమా! 90 ద‌శాబ్దం వారికి ఓ మ‌ధుర జ్ఞాపకం. టైమ్ మిష‌న్ కాన్సెప్ట్ తో భూత‌, భ‌విష్య‌త్ వ‌ర్త‌మాన కాలాల‌తో లింక్ చేసిన తీరు, బాల‌య్య బాబు న‌ట‌న న‌భూతో న‌భ‌విష్య‌త్! ఈ సినిమా అన‌గానే గుర్తొచ్చే 10 అంశాల‌ను ఇప్పుడు చూద్దాం!

Advertisement

1)టైం మిషన్:
ఆదిత్య 369 పేరు విన‌గానే టక్కున గుర్తొచ్చేది టైం మెషీన్! పెద్ద‌య్యాక ఏమౌతావ్ అంటే టైం మిష‌న్ క‌నిపెడ‌తా అని మా ఫ్రెండ్ చెప్పిన మాట‌లు నాకిప్ప‌టికీ గుర్తే!

2) బాల‌కృష్ణ ద్విపాత్రాభిన‌యం:

వ‌ర్త‌మాన‌కాంలో కృష్ణ మోహ‌న్ గా, భూత కాలంలో శ్రీకృష్ణ దేవ‌రాయ‌లుగా బాల‌య్య బాబు న‌ట‌న అద్భుతం.!

3) బాల‌కృష్ణ చెప్పిన ప‌ద్యం:
దేవ‌రాయ‌ల ఆస్థానంలో తెనాలి రామ‌లిండు చెప్ప‌బోయే ప‌ద్యాన్ని బాల‌కృష్ణ ముందుగానే చెబుతాడు.! ఆ ప‌ద్యం అద్భుతం. ఆ తెలిసెన్……

4) కోహినూర్ వజ్రం:
ఈ సినిమా త‌ర్వాతే కోహినూర్ వ‌జ్రం గురించి దాని విలువ గురించి మాకు తెల్సింది. దీనిపై చ‌ర్చ‌లు కూడా చేశాం!

Advertisement

5) త‌రుణ్
నువ్వే కావాలితో స్టార్ న‌టుడైన త‌రుణ్ ను మేము మొద‌ట‌గా చూసింది ఈ సినిమాలోనే!

6) అష్టదిగ్గజకవులు:
దేవ‌రాయ‌ల ఆస్థానంలోని 8 క‌వుల‌ను ముఖ్యంగా తెనాలి రామ‌లింగ‌డి పాత్ర‌లో చంద్ర‌మోహ‌న్ ను చూసి…ఓహో దేవ‌రాయ‌లి భువ‌న విజ‌యం ఇలా ఉంటుందా? అనుకునేవాళ్లం!

7) జంధ్యాల:
సినిమాలోని డైలాగ్స్, సుత్తివేలు కామెడీ ట్రాక్….జంధ్యాల రాసిన‌వే!

8) ఇళయరాజా:
సెంచ‌రీలు కొట్టే వ‌య‌స్సు మాది, జాన‌వులే నెర జాన‌వులే.., రాస‌లీల వేళ‌…ప్ర‌తి సాంగ్ ఓ మాస్ట‌ర్ పీస్! ఇళ‌య‌రాజా మ్యూజిక్… వేటూరి, సిరివెన్నెలల‌ లిరిక్స్ అద్భుతం!

9) మొదటి సైన్స్ ఫిక్షన్ సినిమా:
టాలీవుడ్ లో వ‌చ్చిన మొద‌టి సైన్స్ ఫిక్షన్ సినిమా‘ఆదిత్య 369’ సింగీతం శ్రీనివాసరావు కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం సూప‌ర్బ్!

10) రికార్డుల మోత:
1.50 కోట్ల‌తో తీసిన ఈ సినిమా 9 కోట్లు వ‌సూల్ చేసింది. ఇండ‌స్ట్రీ రికార్డ్!

Visitors Are Also Reading