హీరోయిన్ అదితి రావు ఐదారి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. తెలుగు తమిళం హిందీ తదితర భాషల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ప్రస్తుతం అవకాశాలు లేకపోవడంతో వెండితెరపై ఆమె సందడి కాస్త కరువై. అయినప్పటికీ హీరో సిద్ధార్థ తో డేటింగ్ చేస్తుందని రూమర్స్ తరచూ వినిపిస్తున్నాయి. సాధారణంగా వాలెంటైన్స్ డే సందర్భంగా ప్రియుడికి లవ్ ప్రపోజ్ చేస్తారు. అదితి రావు హైదరీ మాత్రం పెద్ద ట్విస్ట్ ఇచ్చింది. ప్రియుడిని కాదని మరో సీనియర్ హీరోకి ప్రపోజ్ చేయడం విశేషం.
Advertisement
తాజాగా అదితిరావు హైదరీ బాలీవుడ్ సీనియర్ హీరో ధర్మేంద్రకి వాలెంటైన్స్ డే విషెస్ తెలియజేయడం గమనార్హం. అంతేకాదు.. ది మోస్టెస్ట్.. హ్యాండ్సమ్ అంటూ పేర్కొంది. ఆయనకు గులాబీ పువ్వుని ఇస్తూ.. దిగిన ఫోటోలను ఇన్ స్టా గ్రామ్ ద్వారా పంచుకుంది. ప్రస్తుతం అదితి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఓ షోలో పాల్గొన్న సమయంలో అదితి ఇలా తన ఫేవరేట్ అభిమాన హీరోపై ప్రేమని వెల్లడించింది. సిద్దార్థ్ ని కాదని.. సీనియర్ హీరోకి లవ్ ప్రపోజ్ చేయడం పట్ల సోషల్ మీడియాలో పెద్ద చర్చ కొనసాగుతుంది. సోషల్ మీడియాలో నెటిజన్లు సెటైర్లు పేలుస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ పోస్ట్ పై హీరో సిద్దార్థ్ స్పందించం విశేషం.
Advertisement
Also Read : మనోజ్ పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన మంచు లక్ష్మి.. ఏమంటుంది అంటే..?
తాను కూడా రెండు లవ్ ఎమోజీలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. చాలా కూల్ గా లైట్ గా తీసుకున్నారని చెప్పవచ్చు. అదితి ప్రపోజల్ పెద్దగా తప్పు కోలేకపోయినా.. ప్రేమికుల రోజు ప్రియుడితో కాకుండా మరో హీరోకి పువ్వు ఇవ్వడం ఆశ్చర్యపరుస్తుందంటున్నారు నెటిజన్లు. సిద్ధార్థ్, అదితిరావు హైదరీ మహాసముద్రం అనే చిత్రంలో కలిసి నటించారు. ఈ సినిమాలో ఇద్దరూ లవర్స్ గా నటించారు. ఆ సమయంలోనే వీరి మధ్య ప్రేమ చిగురించిందని.. ఇప్పుడు బలపడిందని అంటున్నారు. ఇటీవల శర్వానంద్ ఎంగేజ్ మెంట్ లో కలిసి రావడం.. కలిసి ఫోటోలకు పోజులు ఇవ్వడంతో తమ రిలేషన్ షిప్ ని బహిర్గతం చేసారు. వాస్తవానికి అదితిరావు హైదరీకి ఎప్పుడో పెళ్లి అయింది. తక్కువ ఏజ్ లోనే సత్యదేవ్ మిశ్రా అనే వ్యాపారవేత్తని మ్యారేజ్ చేసుకున్నారు. ఎప్పుడూ ఆ విషయాన్ని బయటపెట్టలేదు. సీక్రెట్ గా ఉంచారు. ఆ తరువాత కొన్నాళ్లకి విడిపోయినట్టు వెల్లడించారు. ప్రస్తుతం అదితి గాంధీ టాక్స్ అనే సైలెంట్ మూవీ రెండు వెబ్ సిరీస్ లు చేస్తుంది. సిద్ధార్థ్ ఇండియన్ 2 లో ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు.
Also Read : ప్రేమికుల రోజు సందర్భంగా ‘జియో’ బంపర్ ఆఫర్..!