టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా గుర్తింపు తెచ్చుకున్న వాళ్ళలో నటి ప్రగతి కూడా ఒకరు. సినిమాల్లో అత్త, తల్లి లాంటి పాత్రలు చేస్తూ ప్రగతి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. కేవలం ఎమోషనల్ సన్నివేశాలలో నటించడమే కాకుండా కామెడీ పండించడంలో కూడా ప్రగతికి మంచి గుర్తింపు ఉంది. ఇక సోషల్ మీడియాలో కూడా ప్రగతికి ఎంతో ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే.
Advertisement
వర్క్ ఔట్ చేస్తున్న వీడియోలు మరియు రీల్స్ వీడియోలతో ప్రగతి నెట్టింట హల్ చల్ చేస్తుంటారు. ఏజ్ పెరిగినా హీరోయిన్ లకు పోటీ ఇచ్చేలా వర్కౌట్ చేస్తూ ప్రగతి కుర్రాళ్ళ మతి పోగొడుతుంటారు. ఇక ప్రగతి రీసెంట్ గా వచ్చిన ఎఫ్ 2 ఈ సినిమాలో వెంకటేష్, వరుణ్ తేజ్ ల కు అత్తగా నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో పాటు ప్రగతి నటనకు మంచి మార్కులు పడ్డాయి.
Advertisement
ఈ చిత్రానికి సీక్వెల్ గా ఎఫ్ 3 సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలో కూడా ప్రగతి నటించింది. ఇక ఈ సినిమా కూడా మంచి విజయం సాధించడంతో సోమవారం చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ను నిర్వహించారు. ఈ సక్సెస్ మీట్ లో ప్రగతి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. తన కెరీర్ ప్రారంభం నుండి ఎన్నో మంచి పాత్రలు చేశానని చెప్పారు. కానీ తనకు తగ్గ పాత్రలు ఎప్పుడూ ఉండేవి కాదని చెప్పారు. ఆ ఒత్తిడి తట్టుకోలేక కొన్ని రోజులు సినిమాలకు దూరమైనట్టు తెలిపారు. కాఫీ, టీ తీసుకురావడం దగ్గర నుండి విలన్ దగ్గర నిల్చోవడం..
అందమైన యంగ్ అమ్మ లాంటి పాత్రల వరకు చాలా వరకు సెట్ ప్రాపర్టీ లాగే పని చేశానని చెప్పారు. అవి సంతృప్తిని ఇవ్వలేదని… కానీ ఎఫ్ 2 సినిమాలో ఒక మంచి పాత్ర వచ్చిందని అది ఒక బ్లెస్సింగ్ అని అన్నారు. ఆ తర్వాత ఎఫ్ 3 సినిమాలో కూడా అవకాశం వచ్చిందని తన పాత్రకు ఎంతో గుర్తింపు వచ్చిందని చెప్పారు. ఈ సినిమా తనకు ఎంతో సంతృప్తినిచ్చిందని ప్రగతి ఎమోషనల్ అయ్యారు.
Also read :
ఆనంద్ సినిమా హీరో రాజా గుర్తున్నాడా…? ఇప్పుడు ఎలా ఉన్నాడు.. ఏం చేస్తున్నాడో తెలుసా..?