తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటి ఊహ అంటే తెలియని వారు ఉండరు. హీరోయిన్ గా ఎంతో క్రేజ్ తెచ్చుకున్న ఈమె హీరో శ్రీకాంత్ తో అనేక సినిమాలు చేసి ఆయనతో ప్రేమలో పడి చివరికి ఆయన్నే వివాహం చేసుకుంది. మొదటిసారి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆమె అనే సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో వెనక్కి తిరిగి చూసుకోలేదు.
Advertisement
అలాంటి ఊహ అందరికీ తెలుసు కానీ ఆయన మేనమామ కూడా ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ నటుడే. ఆయన ఎవరో ఇప్పుడు చూద్దాం.. ఒకప్పుడు తెలుగు,తమిళ ఇండస్ట్రీలలో భర్త,మామ,తండ్రి, డాక్టర్ పాత్రల్లో నటించి ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు ఈ నటుడు.ఇంతకీ ఆయన ఎవరయ్యా అంటే పి ఎల్ నారాయణ. ఈయన అసలు పేరు ఉదుక్కోట లక్ష్మీనారాయణ. ఈయన సినిమాల్లోకి రాకముందు రంగస్థలం నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. 1992లో యజ్ఞం అనే సినిమాతో అప్పలనాయుడు గా నటించారు.
Advertisement
ఇందులో ఆయన నటనకు గానూ ఉత్తమ సహాయ నటుడిగా జాతీయ పురస్కారం కూడా అందింది. కుక్క నేటి భారతం, మయూరి,రేపటి పౌరులు వంటి సినిమాల్లో ఉత్తమ సహాయ నటుడిగా నంది అవార్డులు కూడా అందుకున్నారు. అలాగే అర్ధరాత్రి స్వతంత్రం చిత్రానికి ఉత్తమ సంభాషణల రచయితగా నంది అవార్డు వచ్చింది. ఎన్నో విలక్షణమైన పాత్రలు పోషించిన పి ఎల్ లక్ష్మీనారాయణ 1998 నవంబర్ మూడున పరమపదించారు. ఈయన నటి ఊహకి స్వయాన మేనమామ అవుతారట
మరి కొన్ని ముఖ్య వార్తలు:
- ఉదయం లేవగానే ఫోన్ చూస్తున్నారా.. ప్రమాదంలో పడ్డట్టే..?
- మెగాస్టార్ దర్శకత్వం వహించిన సినిమా ఏంటో తెలుసా..?
- Video viral:ఈ కుర్రోడు మామూలోడు కాదు.. లేత వయసు అమ్మాయిలతో నడిరోడ్డుపై అలాంటి పని..!!