Home » మా బ‌ట్ట‌ల గురించి మీకెందుకు మీరెమైనా డ‌బ్బులిస్తున్నారా..? నెటిజ‌న్ల‌కు సుప్రీత స్ట్రాంగ్ కౌంట‌ర్..!

మా బ‌ట్ట‌ల గురించి మీకెందుకు మీరెమైనా డ‌బ్బులిస్తున్నారా..? నెటిజ‌న్ల‌కు సుప్రీత స్ట్రాంగ్ కౌంట‌ర్..!

by AJAY
Ad

టాలీవుడ్ లో గుర్తింపు తెచ్చుకున్న క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ లలో సురేఖ వాణి కూడా ఒక‌రు. హీరో హీరోయిన్ ల‌కు అక్క వ‌దిన క్యారెక్ట‌ర్ లు చేస్తూ సురేఖ వాణి ఇండ‌స్ట్రీలో బిజీగా ఉంటారు. ఢీ సినిమాలో సురేఖవాణి చిట్టినాయుడికి త‌ల్లి పాత్ర‌లో న‌టించి చాలా మంది అభిమానుల‌ను సంపాదించుకున్నారు. ఎమోష‌న‌ల్ సీన్ లు కామెడీ సీన్ల‌లో సైతం న‌టిస్తూ న‌టిగా మంచి పేరు తెచ్చుకున్నారు. ఇక సురేఖవాణి భ‌ర్త కూడా ఇండ‌స్ట్రీకి చెందిన వ్య‌క్తే కాగా ఆయ‌న కొంత‌కాలం క్రితం అనారోగ్యం భారిన ప‌డి మ‌ర‌ణించారు.

 

 

Supreetha

Supreetha

అయితే సురేఖ‌వాణికి కూతురు సుప్రీత ఉంద‌న్న సంగ‌తి తెలిసిందే. సుప్రీత సినిమాల్లోకి ఇంకా ఎంట్రీ ఇవ్వ‌క‌పోయిన‌ప్ప‌టికీ టిక్ టాక్ ద్వారా సెల‌బ్రెటీ స్టేట‌స్ ను సంపాదించుకున్నారు. ప్ర‌స్తుతం సుప్రీత హీరోయిన్ గా కూడా ఓ సినిమా చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. అదే విధంగా యాడ్ షూట్స్ కూడా చేస్తుంది. ఇదిలా ఉంటే సురేఖ వాణి సుప్రీత లు చూడ్డానికి త‌ల్లి కూతుళ్ల‌లా కాకుండా ఫ్రెండ్స్ లా ఉంటారు. సోష‌ల్ మీడియాలో వీర‌ద్ద‌రూ వీడియోల‌కు స్టెప్పులు వేస్తుంటారు.

Advertisement

Advertisement

అంతే కాకుండా గోవా బ్యాంకాక్ వెళ్లి ఎంజాయ్ చేస్తుంటారు. దాంతో కొంత‌మంది నెటిజ‌న్లు వీరిపై నెగిటివ్ కామెంట్స్ చేస్తారు. భ‌ర్త చ‌నిపోయిన బాధ కూడా సురేఖ‌వాణికి లేద‌ని ఎంజాయ్ చేస్తుంద‌ని కామెంట్స్ చేస్తారు. అంతే కాకుండా త‌ల్లికూతుళ్ల దుస్తుల పై కూడా నెగిటివ్ కామెంట్స్ వ‌స్తుంటాయి. కాగా తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో సుప్రీత త‌మ‌పై వ‌స్తున్న కామెంట్ల‌కు ఘాటుగా స‌మాధానం ఇచ్చారు.

supritha

మేం ఎలాంటి బ‌ట్ట‌లు వేసుకుంటే మీకెందుకు..మీరేమైనా డ‌బ్బులు ఇస్తున్నారా అంటూ ప్ర‌శ్నించారు. మా నాన్న చ‌నిపోయిన‌ప్పుడు ఎన్ని ఇబ్బందులు పడ్డామో ఎవ‌రైనా చూశారా. మా అమ్మ క‌నీసం బ‌య‌ట‌కు కూడా రాలేద‌ని తెలిపింది. అంతే కాకుండా త‌న త‌ల్లిని దూరంగా తీసుకెళ్లేందుకే బ్యాంకాక్ కు తీసుకువెళ్లిన‌ట్టు తెలిపింది. కానీ అలా వెళ్లినా కూడా నెగిటివ్ గా కామెంట్స్ చేశార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేసింది. త‌న తండ్రి చ‌నిపోయిన‌ప్పుడు ఆయ‌న త‌రుపున వాళ్లు ఎవ‌రూ రాలేద‌ని త‌న త‌ల్లి కుటుంబం వారే అన్నీ చూసుకున్నార‌ని అవేద‌న వ్య‌క్తం చేసింది.

Visitors Are Also Reading