కమెడియన్లుగా ఇండస్ట్రీలోకి ఎంతోమంది నటులు అడుగు పెట్టిన కొంత మందికి మాత్రమే ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించి ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు. ఇలా మన టాలీవుడ్ లో చెప్పుకోవాలి అంటే బ్రహ్మానందం, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎల్బీ శ్రీరామ్, ఎమ్. యస్ నారాయణ వంటి మంచి మేల్ కమెడియన్లు వున్నారు. అయితే టాలీవుడ్ లో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే మేల్ కమెడియన్స్ కాకుండా ప్రేక్షకులలో మంచి గుర్తింపు తెచ్చుకున్న కొంతమంది ఫిమేల్ కమెడియన్స్ కూడా ఉన్నారు. అలా లేడీ కమెడియన్ల విషయానికి వస్తే ముందుగా గుర్తించే పేరు శ్రీలక్ష్మి.
Advertisement
శ్రీలక్ష్మి ఇప్పుడంటే అవకాశాలు లేక తెరమరుగయ్యారు కానీ.. అప్పట్లో శ్రీలక్ష్మి స్క్రీన్‌పై కనిపిస్తే అరటిపండు లంబా లంబా.. బంగాళా బౌ బౌ.. అబ్బ జబ్బ దబ్బ.. బాబు చిట్టి.. అంటూ ఆమె వాడే విచిత్రమైన డైలాగ్స్ తో ప్రేక్షకులను పొట్ట చెక్కలయ్యేలా నవ్వించేది. ఈమె కేవలం తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లో కూడా 500 పైగా చిత్రాల్లో నటించారు. శ్రీ లక్ష్మీ ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూలో తన గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు.
ఇంటర్వ్యూలో భాగంగా ఆమె మాట్లాడుతూ.. మా నాన్నకు మేము ఎనిమిది మంది సంతానం. నాన్న అమర్నాథ్ ఎన్టీఆర్, ఏఎన్నార్ హీరోలుగా కొనసాగుతున్న టైం లో ఇండస్ట్రీలో పెద్ద హీరో. జాండీస్ రావడంతో నాన్న పనిచేయడం మానేశాడు. సైడ్ క్యారెక్టర్లు వస్తే తాను హీరోగా మాత్రమే చేస్తానని లేకపోతే లేదని, చనిపోయిన హీరో స్టేటస్ తోనే చనిపోతానని మొండికేసి చెప్పేవారు. కొంతకాలానికి ఆర్థికంగా సమస్యలు ఎదుర్కోవడంతో అమ్మ నన్ను సినిమా ఇండస్ట్రీలోకి పంపించాలని అనుకుంది. కానీ అది నాన్నకు అసలు ఇష్టం లేదు.
Advertisement
ఆడపిల్లవి ఇండస్ట్రీలో కష్టాలు పడటం ఎందుకమ్మా అని అనేవారట. పరిస్థితులు బాలేవు కదా అని బదిలిస్తే.. నా చేతకాని తనం వల్లే ఇలా మాట్లాడుతున్నావు కదమ్మా అని నాన్న బాధపడేవారు. కానీ అమ్మ మాత్రం నువ్వు నటిస్తేనే అందరం కడుపు నిండా తినగలం లేదంటే విషం తాగి చస్తాం అని మాట్లాడేదని చెప్పుకొచ్చింది శ్రీలక్ష్మి. ఇక తండ్రి అమర్‌నాథ్ చనిపోవడంతో.. శ్రీలక్ష్మి ఆర్థికంగా కుటుంబానికి అండగా సినిమాల్లోకి రావాల్సివచ్చిందట. అలా సినిమా ప్రయత్నాలు చేస్తూ ఉండగా కె. విశ్వనాథ్ దర్శకత్వంలో శుభోదయం సినిమా, బాపు దర్శకత్వంలో వంశవృక్షం సినిమాలలో కథానాయిక అవకాశం వచ్చింది. కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమాల్లో చేయలేకపోయానని శ్రీ లక్ష్మీ వెల్లడించారు.
ఇక మనకి హీరోయిన్ అయ్యే అదృష్టం లేదనుకుని నివురుగప్పిన నిప్పు చిత్రంలో కామెడీ రోల్ చేసిందట శ్రీలక్ష్మి. ఆ సినిమా ఆమెకు ఆశించిన మేరకు గుర్తింపు రాకపోయినా ఆ తర్వాత వచ్చిన జంధ్యాల గారి ‘రెండు జడల సీత’ సినిమాతో శ్రీలక్ష్మి దశ తిరిగింది. లేడీ కమెడియన్ గా మంచి గుర్తింపు సంపాదించడంతో కేవలం ఆమె కోసమే దర్శకులు ఓ వెర్షన్ రాసుకునే స్థాయికి ఎదిగారట శ్రీలక్ష్మి. ‘రెండు జడల సీత’ చిత్రానికి గాను ఉత్తమ లేడీ కమెడియన్ గా శ్రీలక్ష్మి అవార్డును కూడా దక్కించుకున్నారు. అక్కడి నుంచి 13 ఏళ్ల పాటు తిరుగులేని బెస్ట్ కమెడియన్ గా ఎన్నో చిత్రాల్లో నటించారట శ్రీలక్ష్మి.
ఇక తన జీవితం గురించి ఆలోచిస్తే .. ఒక విషయంలో చాలా పెద్ద తప్పు చేశానని అన్నారు. దేవుడు ప్రతి ఒక్కరికీ ఏదో ఒక కొరత పెడతాడని, ఎలాంటి కొరత లేకపోతే వాడు మనిషే కాదు. అలాంటి కొరతే నా జీవితంలో కూడా ఏర్పడింది. నాకు దేవుడు పిల్లలు లేకుండా చేశాడు అంటూ శ్రీలక్ష్మి ఎమోషనల్ అయ్యారు. తన తోడబుట్టిన అక్క, తమ్ముడు, చెల్లెలు పిల్లలే నా పిల్లలు అంటూ చెప్పుకొచ్చారు శ్రీలక్ష్మి.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
ఈసారి సితార గట్టిగానే ప్లాన్ చేసిందిగా.. నెక్ట్స్ ఏం చేయబోతుందంటే..?
వైయస్ షర్మిల కొడుకును చూశారా….అచ్చం హీరోలా ఉన్నాడు !