బాలీవుడ్ బ్యూటీ శిల్పాశెట్టి గత కొద్ది రోజులుగా తరుచూ వార్తల్లో నిలుస్తున్నారు. తన భర్త రాజ్‌కుంద్రా ను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తన భర్తతో పాటు శిల్పకూడా నిందితిరాలు అని పోలీసులు వెల్లడించారు. ఇటీవలే శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా బెయిల్‌పై బయటకి వచ్చారు. అయితే శిల్పాశెట్టికి ఓ కేసు నుంచి ఊరట లభించింది. పదిహేనేళ్ల క్రితం ఓ వివాదంలో శిల్పా నిందితురాలుగా కేసు నమోదు అయింది. వివాదంపై విచారణ చేపట్టిన కోర్టు ఆమె నిందితురాలు అని వెల్లడించింది.
Advertisement
Advertisement
వివరాల్లోకి వెళ్లితే.. 2007లో రాజస్థాన్‌లో జరిగి ఓ కార్యక్రమానికి హాలీవుడ్ నటుడు రిచర్డ్ గేర్, బాలీవుడ్ బ్యూటీ శిల్పాశెట్టి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వేదికపై ఉన్న రిచర్డ్ గేర్డ్ శిల్పా శెట్టిని చూడటంతో పాటు చేతులను తాకడంతో ఆమె అడ్డుకోలేక పోయింది. ఈఘటనలో వీరిద్దరిపై కేసులు నమోదు అయ్యాయి. ముందుగా కేసును రాజస్థాన్ కోర్టులో విచారణ చేపట్టగా.. శిల్పాశెట్టి అభ్యర్థనపై ముంబై మెట్రోపాలిటన్ కోర్టుకు బదిలీ చేయడానికి సుప్రీంకోర్టు అనుమతించింది. తాజాగా సుప్రీంకోర్టు విచారణ జరిపి శిల్పాశెట్టి బాధితురాలు అని వెల్లడించింది. హాలీవుడ్ నటుడు రిచర్డ్ గేర్ ప్రధాన నిందితుడుగా వెల్లడించింది.