Home » నటి సత్య కూతురిని చూశారా? అచ్చం హీరోయిన్‌లా ఉందిగా ..!

నటి సత్య కూతురిని చూశారా? అచ్చం హీరోయిన్‌లా ఉందిగా ..!

by Bunty
Ad

టాలీవుడ్ నటి సత్యకృష్ణన్… గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పనిలేదు.  తెలుగులో సుమారు 60కు పైగా చిత్రాల్లో నటించి మెప్పించింది అందాల తార. ఆనంద్, బొమ్మరిల్లు, సామాన్యుడు, రెడీ, ఉల్లాసంగా ఉత్సాహంగా, దూకుడు, బాద్ షా, గోవిందుడు అందరివాడేలే, పిల్ల నువ్వులేని జీవితం, మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్, ఆడవాళ్లు మీకు జోహార్లు తదితర హిట్ సినిమాలు సత్యకు మంచి పేరు తీసుకొచ్చాయి.

Advertisement

ముఖ్యంగా ఆమె వాయిస్ లో ఉన్న బేస్ కు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. కాగా, ఆరంభంలో వరుస పెట్టే సినిమాలు చేసిన ఈ నటి ఇప్పుడు ఆడపాదడపా మాత్రమే సినిమాలు చేస్తుంది. చివరిగా ఆడవాళ్లు మీకు జోహార్లు, 10th క్లాస్ డైరీస్, అమ్ము అనే సినిమాల్లో మాత్రమే కనిపించిన ఆమె సోషల్ మీడియాలోనూ పెద్దగా యాక్టివ్ గా ఉండడం లేదు. అయితే ఇటీవల కొన్ని ఆడియో ఫంక్షన్ లలో తన కూతురితో కలిసి తలుక్కున మెరిసింది సత్య కృష్ణన్.

Advertisement

దీంతో ఇద్దరు ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి. ముఖ్యంగా అమ్మను మించిన అందంతో సత్య కూతురు అనన్య కృష్ణన్, నెటిజన్లను ఆకట్టుకుంటుంది. అయితే అనన్య ఇప్పటికే తెలుగులో ‘గ్యాంగ్ స్టర్ గంగరాజు’ సినిమాలో ఓ కీలకపాత్రలో నటించింది. తాజాగా “ఊ అంటావా మామ ఉఊ అంటావా మావ” అనే సినిమాలో కూడా కీ రోల్ పోషించింది. అయితే తల్లి మాదిరే అనన్య కూడా క్యారెక్టర్ ఆర్టిస్టుగానే కొనసాగుతుందా? లేదా? హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుందా? అన్నది తెలియాల్సి ఉంది.

 

Visitors Are Also Reading