స్టార్ హీరోయిన్ సాయిపల్లవికి హైకోర్టులో షాక్ తగిలిందనే చెప్పవచ్చు. తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో సాయిపల్లవి దాఖలు చేసిన పిటిషన్‌ను ఇవాళ కోర్టు కొట్టేసింది. కశ్మీర్ ఫైల్స్ సినిమాతో పాటు గోరక్షకులపై సాయిపల్లవి వివాదస్పద వ్యాఖ్యలు చేశారని హైదరాబాద్ సుల్తాన్ బజార్ పోలీసులకు భజరంగ్‌దళ్ నాయకులు ఇటీవల ఫిర్యాదు చేశారు. భజరంగదళ్ నాయకుల ఫిర్యాదుపై న్యాయ సలహా తీసుకొని కేసు నమోదు చేసిన పోలీసులు సాయిపల్లవికి గత నెల 21న నోటీసుల జారీ చేశారు.
Advertisement
నోటీసులు రద్దు చేయాలని కోరుతూ ఆమె తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. సాయిపల్లవి అభ్యర్థనను తోసిపుచ్చిన హైకోర్టు పిటిషన్ కొట్టివేసింది. ప్రధాన పాత్ర పోషించిన విరాటపర్వం సినిమా ప్రచారంలో భాగంగా సాయిపల్లవి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. యాంకర్ సాయిపల్లవి నేపథ్యం గురించి ప్రశ్నించగా.. ఆమె స్పందించారు. లెప్ట్‌వింగ్, రైట్‌వింగ్ గురించి విన్నానని, తాను మాత్రం న్యూట్రల్‌గా ఉంటానని చెప్పారు.
Advertisement
ఈ నేపథ్యంలోనే కశ్మీర్ ఫైల్స్ సినిమా గురించి మాట్లాడారు. 90 సంవత్సరంలో కశ్మీర్ పండిట్లను ఎలా చంపారో ఆ చిత్రంలోనే చూపించారు. కరోనా సమయంలో ఓ ప్రాంతంలో గోవును వాహనంలో తరలించారు. దాని డ్రైవర్ ఓ ముస్లిం. కొంత మంది అతడిని కొట్టి జై శ్రీరాం, జై శ్రీరాం అంటూ నినాదాలు చేసారు. అప్పుడు జరిగిన దానికి ఇప్పుడు జరిగిన దానికి తేడా ఏముంది..? మనం మంచిగా ఉండాలి. ఎదుటివారిని ఇబ్బంది పెట్టకూడదని సాయిపల్లవి తన అభిప్రాయం వ్యక్తం చేశారు.
Also Read :
ఇంతకాలం సినిమాలకు దూరంగా ఎందుకు ఉన్నారో చెప్పిన తొట్టెంపూడి వేణు
వాట్సాప్ వినియోగదారులకు శుభవార్త.. అంతా ఆటోమెటిక్ ప్రాసెసే..!