కాస్టింగ్ కౌచ్ ఈ పదం సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడూ వినిపిస్తూనే ఉంటుంది. హీరోయిన్లు మాత్రమే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టులు, జూనియర్ ఆర్టిస్టులు కూడా తాము క్యాస్టింగ్ కౌచ్ వల్ల బాధపడ్డామని చెప్పిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇక తాజాగా టాలీవుడ్ నటి ప్రగతి క్యాస్టింగ్ కౌచ్ పై నోరు విప్పింది. తను కూడా కాస్టింగ్ బాధితురాలిని అని చెప్పింది. ప్రగతి ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా అడుగుపెట్టినప్పటికీ సరైన సక్సెస్ రాకపోవడంతో ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారింది.
Advertisement
వందల చిత్రాల్లో తల్లి అక్క వదిన వంటి పాత్రలు చేసి ప్రేక్షకులను మెప్పించింది. కానీ ఎక్కువగా తల్లి, అత్త లాంటి పాత్రలతో ప్రగతి ఆకట్టుకుంది. వెంకటేష్ హీరోగా నటించిన ఎఫ్2 అదేవిధంగా రామ్ చరణ్ చిరుత, ఎన్టీఆర్ బృందావనం సినిమాలలో తన నటనతో మెప్పించింది. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రగతి మాట్లాడుతూ షాకింగ్ కామెంట్లు చేసింది. ఓ స్టార్ కమెడియన్ తనను ఇబ్బంది పెట్టాడని చెప్పింది. ఓ సినిమా షూటింగ్ సెట్ లో స్టార్ కమెడియన్ తనతో మిస్ బిహేవ్ చేశాడని చెప్పింది.
Advertisement
కానీ ఆయన తనతో చాలా నైస్ గా ఉండే వారని… అందరితోనూ చాలా నైస్ గా ఉంటారని చెప్పింది. ఎందుకో ఒకరోజు సడన్ గా అతని బిహేవియర్ సరిగా లేదని చెప్పింది. సెట్ లో సడన్ గా మిస్ బిహేవ్ చేసేసరికి ఏంటి ఆయన ఇలా చేశారు అనిపించింది అని చెప్పింది. దాన్ని జీర్ణించుకోవడం చాలా కష్టంగా అనిపించిందని ఆవేదన వ్యక్తం చేసింది. ఆ ఘటన జరిగిన తర్వాత లంచ్ కూడా తినలేకపోయానని…. సాయంత్రం టీ కూడా తాగలేకపోయానని ఆవేదన వ్యక్తం చేసింది.
దాంతో సినిమా షూటింగ్ పూర్తయ్యే సమయానికి తనే కమెడియన్ ను క్యారెవాన్ లోకి తీసుకువెళ్లానని తెలిపింది. నేను ఎప్పుడైనా మీకు రాంగ్ సిగ్నల్స్ ఇచ్చానా లేదా నా కాలు పొరపాటున మీకు తగిలిందా…? అంటూ నిలదీశానని చెప్పింది. దాంతో అయ్యో అలా అంటావ్ ఏంటమ్మా అంటూ ఆయన సమాధానం ఇచ్చారని వ్యాఖ్యానించింది. ఆ తర్వాత ఆయనే ప్రగతికి చాలా పొగరు అంటూ ప్రచారం చేశారని చెప్పింది. అయితే ఆ స్టార్ కమెడియన్ ఎవరు అన్న సంగతి మాత్రం ప్రగతి బయట పెట్టలేదు.