టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది నటీనటులు ఉన్న సంగతి తెలిసిందే అందులో కొందరు మాత్రమే పాపులర్ అవుతారు. కొంతమంది ఎన్ని మంచి పాత్రలు చేసిన సక్సెస్ కాలేరు. అయితే కొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు చేసి కూడా సక్సెస్ అయిన వారు ఉన్నారు. అలా సక్సెస్ అయిన వారిలో నటి ప్రగతి ఒకరు. టాలీవుడ్ నటి ప్రగతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
ప్రతి సినిమాలో హీరో తల్లిగా లేదా హీరోయిన్ తల్లిగా… కనిపిస్తుంది నటి ప్రగతి. ముఖ్యంగా కమెడియన్ బ్రహ్మానందం భార్యగా చాలా సినిమాలలో అందరినీ కన్విందు చేసింది నటి ప్రగతి. ఈమధ్య కాలంలో సోషల్ మీడియాలో తన జిమ్ వీడియోలు పెట్టి… బాగా పాపులర్ అయింది. అంతేకాదు మొన్న జాతీయ స్థాయిలో అవార్డు కూడా తెచ్చుకుంది. అలాంటి నటి ప్రగతి తాజాగా తన కెరీర్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. తాను చిన్నప్పుడే తల్లి అయ్యానంటూ అందరినీ షాక్ నకు గురిచేసింది.
Advertisement
ఇండస్ట్రీలోకి వచ్చేటప్పుడు హీరోయిన్ కావాలని నటి ప్రగతి అనుకున్నారట. కానీ ఇండస్ట్రీలో హీరోయిన్గా ఛాన్స్ అసలు రాలేదని ఆమె చెప్పింది. దీంతో హీరోయిన్ గా కాకుండా తల్లి పాత్రలలో… సైడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలలో నటించమని ఒక వ్యక్తి చెప్పారట. అలా అయితే లైఫ్ లాంగ్ నీకు ఛాన్సులు వస్తాయని సదరు వ్యక్తి సలహా ఇచ్చారట. దీంతో అప్పటి నుంచి తల్లి పాత్రలలో తాను కనిపిస్తున్నానని ప్రగతి వెల్లడించారు. దీంతో చిన్నప్పుడే నటి ప్రగతి తల్లి అయిందని కొంతమంది ప్రచారం చేస్తున్నారు.
Advertisement
మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!