Home » mrunal thakur : ఒక్కసారే రెమ్యునరేషన్‌ భారీగా పెంచేసిన మృణాల్ ఠాకూర్..! ఒక్కో సినిమాకు ఎంత తీసుకుంటుందంటే ..?

mrunal thakur : ఒక్కసారే రెమ్యునరేషన్‌ భారీగా పెంచేసిన మృణాల్ ఠాకూర్..! ఒక్కో సినిమాకు ఎంత తీసుకుంటుందంటే ..?

by Mounika

mrunal thakur :  సీతారామం చిత్రంలో ట్రెడిషనల్ లుక్ లో కనిపించి తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న బ్యూటీ మృణాల్ ఠాకూర్‌. ఒకే ఒక్క సినిమాతో తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లో కూడా మంచి క్రేజ్ సొంతం చేసుకుంది మృణాల్. సీతారామం చిత్రంతో సీతామహాలక్ష్మీ పాత్రలో మృణాల్ ఒదిగిపోయిన తీరుకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. సీతారామం చిత్రంలో ఎంతో పద్ధతిగా కనిపించిన ఈ భామ సోషల్ మీడియా తన లేటెస్ట్ ఫోటోలను విడుదల చేస్తూ ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకోవడమే కాకుండా సినీ ఇండస్ట్రీని కూడా తనపై ఎక్కువగా దృష్టి పెట్టేలా చేస్తుంది. దీనితో అమ్మడికి భారీ ఆఫర్లు క్యూ కడుతున్నాయి..

సీతా రామం చిత్రంలో మృణాల్ తన పాత్ర కోసం మొదట రూ. 85 లక్షలు అందుకున్నట్లు సమాచారం వినిపిస్తుంది. అయితే ఈ చిత్రం ఘన విజయం సాధించడంతో మృణాల్ కి సినీ ఇండస్ట్రీలో వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం టాలీవుడ్ మరియు బాలీవుడ్ రెండింటిలో ఆఫర్లతో ఫుల్ బిజీగా ఉంది. ఇక  ఇదే మంచి సమయమని అనుకుందో ఏమో కాని.. మరో అడుగు ముందుకు వేసింది ఈ బ్యూటీ. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనే ఫార్ములా మృణాల్ బాగా ఫాలో అవుతున్నట్లు ఉంది.

ప్రస్తుతం సూపర్ జోష్‌తో దూసుకుపోతున్న ఈ భామ.. ఆమెకు ఉన్న ఫాలోయింగ్‌ను బేస్‌ చేసుకొని భారీగా రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తుందట. ఏకంగా ఒక్క సినిమాకి రెండు కోట్ల వరకు డిమాండ్ చేస్తుందని సమాచారం వినిపిస్తుంది.   ప్రస్తుతం టాలీవుడ్‌ బిజీ హీరోయిన్స్‌ లిస్ట్‌లో చేరిన ఈ భామ కొత్త సినిమాకు సైన్ చేయాలంటే భారీ పేమెంట్ ఇవ్వాల్సిందే అని డిమాండ్ చేస్తుందట. ప్రస్తుతం మృణాల్ ఠాగూర్ పరశురాం దర్శకత్వంలో విజయ దేవరకొండ సరసన హీరోయిన్గా నటిస్తోంది. అంతేకాకుండా నేచురల్ స్టార్ నాని, రానా దగ్గుబాటితో కూడా చిత్రాలలో నటిస్తోంది..

దళపతి విజయ్ దర్శకుడు విజయ్ గోపిచంద్ మలినేనితో ఈ సినిమా చేయకపోవడానికి కారణం ఏంటో తలుసా..?

చెప్పు తెగుద్ది అంటూ రిపోర్టర్ కి గట్టిగా వార్నింగ్ ఇచ్చిన బేబీ సినిమా హీరోయిన్.. ఇంతకీ అతను ఎవరంటే..?

దానవీరశూరకర్ణలో సినిమాలో ఏఎన్నార్ కి ఎన్టీఆర్ ఆఫర్ ఇచ్చినా వద్దన్నారట..ఎందుకో తెలుసా ?

 

Visitors Are Also Reading