Home » లిక్కర్ పార్టీ పేరుతో న్యూసెన్స్.. బిగ్ బాస్ ఫేమ్ హిమజ అరెస్ట్ !

లిక్కర్ పార్టీ పేరుతో న్యూసెన్స్.. బిగ్ బాస్ ఫేమ్ హిమజ అరెస్ట్ !

by Bunty
Ad

టాలీవుడ్‌ ఇండస్ట్రీకి చెందిన నటీ, నటులు మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. మందు పార్టీలో పాల్గొని.. రెడ్‌ హ్యాండెడ్‌ గా పోలీసులకు దొరికిపోయారు టాలీవుడ్‌ సెలబ్రీటీలు. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే…. ఇబ్రహీంపట్నం నియోజక వర్గంలో ఉన్న జేబీ వెంచర్స్ లో మహేశ్వరం ఎస్‌ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు. జేబీ వెంచర్స్ లో లిక్కర్ పార్టీ జరుగుతున్నట్లు సమాచారం అందడంతో… పోలీసులు దాడులు చేశారు.

Actress Himaja Rave Party Controversy

పక్క సమాచారంతో దాడి చేసిన మహేశ్వరం ఎస్‌ఓటీ పోలీసులు….అర్ద రాత్రి ఒంటి గంటకు జేబీ వెంచర్స్ లో ఎటాక్‌ చేశారు. ఈ తరుణంలోనే…బిగ్ బాస్ ఫేమ్ హిమజతో పలుగురు అరెస్ట్‌ అయ్యారని సమాచారం. బిగ్ బాస్ ఫేమ్ హిమజ ఇంట్లో నే ఈ మందు పార్టీ నిర్వహించారట. ఈ పార్టీలో పెద్ద ఎత్తున యువతీ, యువకులు పాల్గొన్నారని పోలీసులు గుర్తించారు. ఈ దాడులలో 15 లీటర్ల మద్యం, సౌండ్ సిస్టం సీజ్ చేశారు పోలీసులు. ఎన్నికల కోడ్ నిబంధలను ఉల్లఘించిన సంఘటన కింద కేసు నమోదు చేశారు పోలీసులు.

Advertisement

Actress Himaja Rave Party Controversy

ఈ పార్టీలో హిమజ, హేమ, బిగ్ బాస్ ఫేమ్ నీలిమ, యాంకర్ ప్రవీణ, తేజు, పవిత్ర, రోహిణి ఉన్నారని సమాచారం అందుతోంది. అయితే.. ఈ సంఘటనపై బిగ్ బాస్ ఫేమ్‌ హిమజా కూడా స్పందించారు. ఈ మేరకు వీడియో కూడా రిలీజ్ చేశారు. తనను అరెస్టు చేసినట్లు వస్తున్న వార్తలు తప్పు అని ఆమె స్పష్టం చేశారు. అవన్నీ అవాస్తవాలు అని క్లారిటీ ఇచ్చారు. తన కొత్త ఇంట్లో పార్టీ జరిగింది వాస్తవమని… కానీ అది రేవ్ పార్టీ కాదని పేర్కొన్నారు. పోలీసులు వచ్చి.. చెక్‌ చేసారు.. కానీ ఎవరినీ అరెస్ట్‌ చేయలేదని వెల్లడించారు. తమ ఇంట్లో దీపావళి పండుగ పార్టీ జరిగిందన్నారు.

Advertisement

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading