టాలీవుడ్ లో ఎంతో అందంగా ఉన్నా కొంతమంది తెలుగమ్మాయిలు ఇండస్ట్రీలో రానించలేకపోయారు. అలా ఎంతో అందం ఉండి మొదట ఆఫర్లు వచ్చినప్పటికీ స్టార్ హీరోయిన్ రేంజ్ ను అందుకోలేపోయిన తెలుగందం అర్చన శాస్త్రి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అర్చన ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. నేను సినిమా ద్వారా తనకు ఎంతో గుర్తింపు వచ్చిందని అర్చన తెలిపింది. అంతే కాకుండా తాన కెరీర్ లో చేసిన కొన్ని తప్పుల వల్ల అనుకున్న సక్సెస్ చూడలేకపోయానని చెప్పింది.
Advertisement
అర్చన నువ్వస్తానంటే నేనొద్దంటానా సినిమాలో లల్లీ అనే పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది కూడా. అంతే కాకుండా అర్చన పాత్రకు కూడా మంచి మార్కులు పడ్డాయి. అయితే ఆ సినిమా చేయడం వల్ల తనకు డ్యామేజ్ జరిగిందని అర్చన ఆవేదన వ్యక్తం చేసింది.
Advertisement
ఆ సినిమా సమయంలోను తాను హీరోయిన్ గా నటించిన కొంచెం ఇష్టం కొంచెం కష్టం సినిమా విడుదలైందని తనకు ఆ సినిమా హిట్ అయ్యిందని సంతోష పడాలో తాను హీరోయిన్ గా నటించిన సినిమా ఫ్లాప్ అయ్యిందని ఫ్లాప్ అయ్యిందని బాధపడాలో అర్థం కాలేదని తెలిపింది.
నువ్వొస్తానంటే నేనొద్దాంటానా సినిమా తనకు మంచి అవకాశమేనని తాను దర్శకుడిని నిర్మాతను నిందించడంలేదని కానీ తాను హీరోయిన్ గా స్థిరపడాల్సిన సమయంలో తీసుకున్న నిర్ణయం కెరీర్ ను డ్యామేజ్ చేసిందని తెలిపింది. అంతే కాకుండా ఆట షో కు జడ్జ్ గా చేశానని ఆ షో మంచి విజయం సాధించిందని అయితే ఆ షో తరవాత కూడా తనకు కొన్ని సినిమా అవకాశాలు తగ్గాయని చెప్పింది. ఇక అర్చన చివరగా బిగ్ బాస్ షో ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ALSO READ : ఇండస్ట్రీకి నాగార్జున వెన్నుపోటు..? వర్మ ఆసక్తికర కామెంట్లు..!