Home » తెలుగు హీరోయిన్ అంజ‌లి సినిమాల ద్వారా ఎన్ని కోట్లు సంపాదించిందో తెలుసా..?

తెలుగు హీరోయిన్ అంజ‌లి సినిమాల ద్వారా ఎన్ని కోట్లు సంపాదించిందో తెలుసా..?

by AJAY
Ad

అందం అభిన‌యం ఉన్నా కూడా తెలుగ‌మ్మాయిలు చాలా త‌క్కువ శాతం సినిమా ఇండ‌స్ట్రీలో రానిస్తుంటారు. కానీ హీరోయిన్ అంజ‌లి మాత్రం అలా కాదు. తెలుగుతో పాటూ త‌మిళ మ‌ల‌యాళ భాష‌ల్లోనూ సినిమాలు చేసి అభిమానుల‌ను సంపాదించుకుంది. షాపింగ్ మాస్ సినిమా ద్వారా అంజ‌లి టాలీవుడ్ కు ప‌రిచ‌యం అయ్యింది. జ‌ర్నీ సినిమాలో హీరోయిన్ గా న‌టించి మంచి మార్కులు కొట్టేసింది. అదేవిధంగా సీత‌మ్మ‌వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు సినిమాలో అంజ‌లి వెంక‌టేష్ కు జోడీగా న‌టించి ప్రేక్ష‌కుల‌ను అల‌రించింది.

Advertisement

ఏమో నాకు ముందే అన్నీ తెలిసిపోతాయ్ అంతే అంటూ డైలాగ్ చెబుతూ….వెంక‌టేష్ ను చూస్తేనే బ‌య‌ప‌డిపోయే మ‌ర‌ద‌లి రోల్ లో అంజ‌లి జీవించేసింది. ఆ త‌ర‌వాత వ‌రుస అవ‌కాశాల‌ను అందుకుంది. అంతే కాకుండా తెలుగమ్మాయి అయిన‌ప్ప‌టికీ అంజ‌లి ఎక్క‌డా గ్లామ‌ర్ రోల్స్ విష‌యంలో హ‌ద్దులు పెట్టుకోలేదు. ప‌వ‌క‌దైగ‌ల్ అనే వెబ్ సిరీస్ లో అంజ‌లి లెస్బియ‌న్ గా న‌టించి ఆశ్చ‌ర్య‌ప‌ర్చింది. గ్లామ‌ర్ షో తో కుర్రాళ్ల‌ను క‌ట్టిప‌డేసింది.

Advertisement

Anjali

Anjali

చివ‌ర‌గా అంజ‌లి ప‌వ‌న్ క‌ల్యాణ్ హీరోగా నటించిన వ‌కీల్ సాబ్ సినిమాలో ముఖ్య‌మైన పాత్ర‌లో న‌టించి అలరించిన సంగ‌తి తెలిసిందే. అంతే కాకుండా ప్ర‌స్తుతం రామ్ చ‌ర‌ణ్ శంక‌ర్ ల కాంబినేష‌న్ లో తెర‌కెక్కుతున్న సినిమాలో కూడా ముఖ్య‌మైన పాత్ర‌లో న‌టిస్తున్న‌ట్టు స‌మాచారం. ఇలా వ‌రుస సినిమాల‌తో ఫుల్ బిజీగా ఉంటున్న అంజ‌లి చేతినిండా సంపాదిస్తోందట‌.

దీపం ఉన్న‌ప్పుడే ఇల్లు చ‌క్కబెట్టుకోవాలి అన్న‌ట్టుగా ఆస్తుల‌ను కూడబెట్టుకుంటుంద‌ట‌. ఇండ‌స్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్ర‌కారం అంజ‌లికి హైద‌రాబాద్ తో పాటూ చెన్నై లోనూ ఇల్లు ఉంది. అంతే కాకుండా సినిమాల ద్వారాను ఇప్ప‌టి వ‌ర‌కూ ప‌దికోట్ల వ‌ర‌కూ సంపాదించికున్న‌ట్టు టాక్. ఇక గ‌తంలో అంజ‌లికి త‌న బంధువుల‌తో ఆస్తుల విష‌యమై గొడ‌వ‌లు జ‌రిగిన సంగతి తెలిసిందే.

ALSO READ :

ఆ సినిమాల్లో సెట్ ప్రాపర్టీలాగే పనిచేశా….నటి ప్రగతి ఎమోషనల్….!

Visitors Are Also Reading