Home » పవన్ మొదలు సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన సినిమా తారలు వీరే…!

పవన్ మొదలు సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన సినిమా తారలు వీరే…!

by Sravanthi
Ad

పవన్ కళ్యాణ్ మొదలు కంగానా వరకు సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన తారల లిస్ట్ ఇప్పుడు చూద్దాం. వీళ్లంతా కూడా ఎన్నికల్లో గెలుపొందారు.

పవన్ కళ్యాణ్:

Advertisement

పవన్ కళ్యాణ్ ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయాన్ని అందుకున్నారు. జనసేన పార్టీ వ్యవస్థాపకుడు పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుండి పోటీ చేశారు. జనసేన పార్టీకి చెందిన 21 మంది అభ్యర్థులు కూడా విజయాన్ని అందుకున్నారు.

నందమూరి బాలకృష్ణ:

నందమూరి బాలకృష్ణ హిందూపురం నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. ఇది హ్యాట్రిక్ విజయం.

కంగానా:

బాలీవుడ్ నటి కంగానా గత ఐదేరేళ్లుగా బీజేపీకి అనుకూలంగా ట్వీట్లు చేస్తున్నారు ప్రతిఫలంగా ఈసారి లోక్సభ టికెట్ దక్కింది. బరిలోకి దిగిన తొలి ఎన్నికల్లో కంగానా విజయాన్ని సాధించారు.

సురేష్ గోపి:

మలయాళం నటుడు సురేష్ గోపి కేరళలో చరిత్రను సృష్టించారు. బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఘనవిజయాన్ని అందుకున్నారు.

రవి కిషన్:

Advertisement

ఉత్తరప్రదేశ్లోని గోరఖ్ పూర్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి బీజేపీయే అభ్యర్థిగా పోటీ చేసి విజయాన్ని అందుకున్నారు.

మనోజ్ తివారి:

నటుడు గాయకుడు అయినా మనోజ్ తివారి ఈశాన్య ఢిల్లీ నియోజక వర్గం నుండి పోటీ చేసి గెలిచారు.

అరుణ్ గోవిల్‌:

సీరియల్ రామాయణంలో రాముడి పాత్ర పోషించిన అరుణ్ గోవిల్ బిజెపి తరఫునుండి పోటీ చేసే ఘనవిజయాన్ని అందుకున్నారు.

రచన బెనర్జీ:

తెలుగు సినిమాల్లో నటించిన రచన బెనర్జీ హుగ్లీ నుండి పోటీ చేసి గెలిచారు.

శత్రుజ్ఞ సిన్హా:

శత్రుజ్ఞ మోదీ పై విమర్శలు చేసి పార్టీని విడిచిపెట్టి వెళ్లిపోయారు ఈ ఎన్నికల్లో బెంగాల్లోని టిఎంసి అభ్యర్థిగా పోటీ చేసి ఘనవిజయాన్ని అందుకున్నారు.

హేమమాలిని :

బిజెపి అభ్యర్థిగా పోటీ చేసిన హేమమాలిని మరోసారి విజయాన్ని అందుకున్నారు.

తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading