Home » అప్పట్లో రూ.3కోట్లు తీసుకున్న సునీల్.. ప్రస్తుతం రెమ్యునరేషన్ ఎంతంటే ?

అప్పట్లో రూ.3కోట్లు తీసుకున్న సునీల్.. ప్రస్తుతం రెమ్యునరేషన్ ఎంతంటే ?

by Anji
Ad

టాలీవుడ్ నటుడు సునీల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ముఖ్యంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉండేటువంటి టాప్ కమెడియన్ గా  సునీల్  మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. తొలుత  తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిన్న చిన్న పాత్రల ద్వారా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న సునీల్.. తెలుగులో కామెడీ కింగ్ గా ఎదిగారు. అలాంటి సునీల్ అప్పట్లో సినిమాలో నటిస్తే రూ.10 లక్షల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకునేవారు. అలా కామెడియన్ గా  మంచి గుర్తింపు సంపాదించిన సునీల్ ఆ తర్వాత సినిమాలు చేస్తూ హీరోగా మారిపోయాడు .

Advertisement

ఇక ఆ తరువాత రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన మర్యాద రామన్న సినిమా ద్వారా హీరోగా మారిన సునీల్ ఒక్కో సినిమాకి మూడు కోట్ల దాకా రెమ్యూనరేషన్ అందుకునే రేంజ్ కీ చేరారు. ఇక ఆ తరువాత  పూలరంగడు సినిమా తర్వాత సునీల్ చేసిన సినిమాలు అన్ని ఫ్లాప్ అవ్వడంతో మార్కెట్ చాలా డల్ అయిపోయింది. దీంతో ఆయనకు సరైన అవకాశాలు రాకపోవడంతో రూటు మార్చాడు. కలర్ ఫోటో సినిమాలో సునీల్ ఓవైపు విలనిజం చూపించి, సునీల్ తర్వాత రీసెంట్ టైంలో పుష్ప, జైలర్, మహావీరుడు, ఇలా తమిళ్ సినిమాలో డిఫరెంట్ రోల్స్ లో మెప్పిస్తూ వచ్చాడు. 

Advertisement

మళ్లీ ఇప్పుడు తన కెరియర్ లో మంచి జోరులో ఉన్నటువంటి సునీల్ కమెడియన్ రోల్స్ లెవెల్ లో కాకుండా ఇప్పుడు ఒక్కో సినిమాకి 5 నుంచి 8 లక్షల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటున్నాడు. ఈ విధంగా మూడు కోట్లు తీసుకున్న సునీల్ ఆ తర్వాత తగ్గుతూ వచ్చాడు. ప్రస్తుతం నెగిటివ్ రోల్స్ చేస్తూ అంటూ ప్రత్యేకమైన గుర్తింపుతో దూసుకుపోతున్నాడు. అటు టాలీవుడ్, కోలీవుడ్ సినిమాల్లో ఛాన్స్ కొట్టేశాడు సునీల్. 

మరిన్ని టాలీవుడ్ న్యూస్  కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading