ఒకప్పటి స్టార్ హీరో ఉదయ్ కిరణ్ చనిపోయి ఇప్పటికి ఏళ్లు గడుస్తున్నా అభిమానులు, సినీ సెలబ్రెటీలు మాత్రం ఆయనను మర్చిపోలేకపోతున్నారు. ఉదయ్ కిరణ్ బ్రతికి ఉంటే ఇండస్ట్రీలో ఓ స్థాయిలో ఉండేవారని అనుకుంటూ ఉంటారు. ఇక ఉదయ్ కిరణ్ తో కలిసి పనిచేసిన నటీనటులు ఏ ఇంటర్వ్యూకు వెళ్లినా ఆయన గురించి ఆసక్తికర విషయాలను చెబుతుంటారు. కాగా ఓ ఇంటర్వ్యూలో నటుడు సాయి కిరణ్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు.
ఇవి కూడా చదవండి: ఉదయ్ కిరణ్ మరణం గురించి షాకింగ్ నిజాలు బయటపెట్టిన శ్రీదేవి..!
Advertisement
సాయికిరణ్ నువ్వేకావాలి సినిమాలో అనగనగా ఆకాశం ఉంది అనే పాటతో ఎంతో పాపులారిటీ సంపాదించుకున్నాడు. ఒకప్పటి స్టార్ సింగర్ సుశీలమ్మకు సాయికిరణ్ మనవడు అవుతాడు. సాయి కిరణ్ తండ్రి కూడా సింగర్ కావడం విశేషం. సాయికిరణ్ మొదట సీరియల్స్ లో పనిచేసి ఆ తరవాత సినిమా ఆఫర్ ను అందుకున్నాడు. ఇక ఆ తారవాత సాయి కిరణ్ చాలా సినిమాల్లో నటించాడు. కానీ ఆ తరవాత అవకాశాలు తగ్గడంతో నటనకు గుడ్ బై చెప్పాడు.
Advertisement
ఇక ఇటీవల మళ్లీ సీరియల్స్ ద్వారా నటుడుగా రీఎంట్రీ ఇచ్చాడు. సీరియల్స్ లో తండ్రి పాత్రలు సైతం చేస్తున్నాడు. అంతే కాకుండా సినిమాల్లోనూ నటిస్తున్నాడు. ఇక సాయి కిరణ్ ఓ ఇంటర్వ్యూలో ఉదయ్ కిరణ్ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఉదయ్ కిరణ్ తనకు మంచి స్నేహితుడని చెప్పాడు. సినిమా వజ్రోత్సవాల సమయంలో తమ మధ్య స్నేహం ఏర్పడిందని చెప్పారు.
క్రికెట్ మ్యాచ్ లు ఆడటం వల్ల తమ మధ్య స్నేహం బలపడిందని తెలిపాడు. ఉదయ్ కిరణ్ మరణం చాలా బాధాకరం అని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇక ఉదయ్ కిరణ్ తన బాధను కాన్నీ కోపాన్ని కానీ ఎవరితో పంచుకోడని చెప్పాడు. ఉదయ్ కిరణ్ మరణం తరవాత ఆయన కుటుంబం ఎక్కడ ఉంటుందో తెలియదని చెప్పాడు. కానీ ఉదయ్ బ్రతికుంటే తమిళ ఇండస్ట్రీ వైపు అడుగులు వేస్తే మంచి అవకాశాలు వచ్చేవని చెప్పాడు.
ALSO READ : ఫ్లాప్ టాక్ వచ్చినా యూత్ మనసు దోచుకున్న పవన్ కల్యాణ్ 7 సినిమాలు ఇవే..!