సాధారణంగా చాలామందికి పీఎల్ నారాయణ అంటే అసలు గుర్తుపట్టరు. అదే రుద్రవీణ, మయూరి చిత్రాల్లో హీరోయిన్ తండ్రి పాత్రలు నటించిన వ్యక్తి అంటే ఇట్టే గుర్తుపట్టేస్తారు.. తెలుగు, తమిళ ఇండస్ట్రీలలో సుమారు 300 కి పైగా చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. రాజకీయ నాయకుడు, అమాయకపు తండ్రి, లాయర్ భర్త ఇలా ఎన్నో పాత్రలు చేసి వాటికి ప్రాణం పోశారని చెప్పవచ్చు.
Advertisement
టాలీవుడ్ లో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న పిఎల్ నారాయణ మలయాళ కుటుంబానికి చెందిన వ్యక్తి. కానీ ఆయన పుట్టి పెరిగింది బాపట్ల గుంటూరు. విద్యాభ్యాసం కూడా అక్కడ జరిగింది.. ఇక ఆయన చదువుకునే రోజుల్లోనే నాటకం మీద ఆసక్తితో ఒంగోలు ప్రజానాట్య మండలిలో చేరాడు. ఆ టైంలో ఆయన రాసిన కుక్క నాటకం జాతీయ స్థాయిలో అవార్డును పొందింది. ఈ నాటకం తర్వాత ఆయనకు సినిమాల్లో అవకాశాలు కూడా వచ్చాయి.
Advertisement
అలా 300కు పైగా చిత్రాలు నటించిన నారాయణ వారసురాలు ప్రస్తుతం సినిమాల్లో స్టార్ హీరోయిన్ గా ఒక ఊపు ఊపింది. ఇంతకీ ఆమె ఎవరయ్యా అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న నారాయణ మేనకోడలు ఊహ. ఆమె చిత్రం ద్వారా తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఊహ అసలు పేరు శివరంజని. తెలుగులో శ్రీకాంత్ తో ఎక్కువ సినిమాల్లో నటించి చివరికి ఆయనతో ప్రేమలో పడి వివాహం కూడా చేసుకుంది.
మరికొన్ని ముఖ్య వార్తలు:
- Sharwanand : హీరో శర్వానంద్ కు ఘోర రోడ్డు ప్రమాదం..పెళ్లికి ముందే దారుణం !
- ఫ్లాప్ టాక్ తో టాప్ లో నిలిచిన చిరంజీవి మూవీ… ఎన్ని కలెక్షన్లో తెలిస్తే షాక్ అవుతారు..!
- Sr.Ntr Unseen Pics and Images: ఇప్పటివరకు మీరు చూడని 45+ ఎన్టీఆర్ ఫొటోలు ఇవే..!