Home » నరేష్ పవిత్ర గురించి అప్పుడే హింట్ ఇచ్చాడా…?

నరేష్ పవిత్ర గురించి అప్పుడే హింట్ ఇచ్చాడా…?

by Azhar
Ad

ప్రస్తుతం టాలీవుడ్ లో నడుస్తునా పెద్ద చర్చ నరేష్ – పవిత్రల సంబంధం గురించి. ఇప్పుడు మన టాలీవుడ్ మాత్రమే కాకుండా మొత్తం తెలుగు మీడియా కూడా ఇదే విషయం పై ఫోకస్ అనేది పెట్టింది. అయితే ఈ వార్తలు కూడా ఇప్పటికే చాల మంది విని ఉంటారు. అదేంటంటే.. నరేష్ నటి పవిత్రను పెళ్లి చేసుకోబోతున్నాడు అని అంటున్నారు. ఇదే నిజం అయితే నరేష్ కు ఇది నాలుగో పెళ్లి అవుతుంది. ఎందుకంటే నరేష్ ఇప్పటికే ముద్దు పెళ్లిళ్లు అనేవి చేసుకున్నాడు. అయితే పవిత్రకూడా ఇప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకుంది.

Advertisement

అందుకే ఇప్పుడు ఈ విషయం అనేది ఇంత రచ్చ అవుతుంది. ఈ క్రమంలో గతంలో వీరు కలిసి ఉన్న ఫోటోలు, వీడియోలు కొన్ని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ క్రమంలోనే గతంలో పవిత్ర గురించి నరేష్ మాట్లాడిన ఓ వీడియోను ట్రెండ్ చేస్తూ… నరేష్ పవిత్ర గురించి అప్పుడే హింట్ ఇచ్చాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే నరేష్ – పవిత్ర కలిసి సమ్మోహనం అనే సినిమాలో నటించారు. అందులో వీరు హీరో సుధీర్ బాబుకు అమ్మ, నాన్నగా కనిపించారు. అయితే ఇప్పుడు ఈ సమ్మోహనం ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో నరేష్ మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి.

Advertisement

ఆ ఫంక్షన్ లో నరేష్ మాట్లాడుతూ.. పవిత్ర.. తన తోటి నటుల్లో చాలా బ్యూటిఫుల్ యాక్టర్. అలాగే చాలా మంచి వ్యక్తి కూడా. మేము మొదటి సారి ఈ సినిమాలో కలిసి చేస్తున్నం. ఇక ఈ సినిమా ఆమె కెరియర్ లో పెద్ద టర్నింగ్ పాయింట్” అని నరేష్ చెప్పాడు. ఇక నరేష్ మాటలకూ వెనుక పవిత్ర కూడా సిగ్గు పడుతూ కనిపిస్తుంది. దాంతో ఈ వీడియోను ఇప్పుడు ట్రెండ్ చేస్తూ.. వారు వారి సంబంధం గురించి అప్పుడే చెప్పారు. కానీ మనమే నోటిస్ చేయలేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్. అయితే వీరి మధ్యలో ప్రేమ, సంబంధం ఉంది ఎంతవరకు నిజమో తెలియదు కానీ.. ఇలాంటి వార్తలు, వీడియోలు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి.

ఇవి కూడా చదవండి :

పుజారాల ఆడేవాడు పంత్ మాదిరి ఆడాడు..!

ఐసొలేషన్ నుండి రోహిత్ కు విముక్తి..!

Visitors Are Also Reading