Acharya Movie: టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ దర్శకుల్లో ఒకరు కొరటాల శివ. ఈయన గురించి అభిమానులకు పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం కూడా లేదు. కొరటాల శివ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, మిర్చి మూవీతో దర్శకుడిగా తన సినీ జీవితాన్ని ప్రారంభించారు. అయితే ఈ మూవీ బాక్సాపీస్ వద్ద బంపర్ హిట్ కొట్టడంతో మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన దర్శకుడిగా పేరు పొందాడు. ఆ తర్వాత శివ జనతా గ్యారేజ్, భరత్ అనే నేను, శ్రీమంతుడు వంటి సినిమాలకు దర్శకత్వం వహించారు. ఈ విధంగా మరోసారి ఆచార్య మూవీతో మన ముందుకు వచ్చారు కొరటాల.
Advertisement
Advertisement
ఈ మూవీలో చిరంజీవి మరియు రామ్ చరణ్ హీరోలుగా నటించారు. ఈ సినిమా ఏప్రిల్ 29న భారీ అంచనాల నడుమ థియేటర్లలోకి వచ్చింది . ఈ మూవీ రిలీజ్ అయిన మొదటి షో నుండే మిక్స్ డ్ టాక్ బాక్సాఫీస్ వద్ద సొంతం చేసుకుంది. దీంతో కొరటాల మొదటిసారి ఆచార్య మూవీ తో దర్శకత్వం విషయంలో కొద్దిగా తడబడ్డారు అని, అంత పెద్ద స్టార్ హీరోలు ఉన్నా సినిమాను సరిగా తెరకెక్కించ లేక పోయాడు అని విమర్శలను ఎదుర్కొంటున్నాడు.
ఈ విధంగా ఆచార్య మూవీకి బాక్సాఫీస్ వద్ద మిక్స్ డ్ టాక్ రావడంతో కొరటాల తన పారితోషికంలో 50 శాతం ఆచార్య మూవీ డిస్ట్రిబ్యూటర్లకు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్టు ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇదిలా ఉండగా బాక్సాఫీస్ వద్ద ఆచార్య మూవీ ఏ రేంజ్ లో కలెక్షన్ సాధిస్తుందో వేచి చూడాలి.
ALSO READ;
మహేష్‌బాబుకు షాక్.. సోషల్ మీడియాలో సర్కారు వారి పాట ట్రైలర్..!
దూకుడు మీదున్ననాగచైతన్య.. కారణం ఇదేనా..!!