Rishabh Pant : టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్కు ఊహించని పరిణామం చోటు చేసుకుంది. టీమిండియా క్రికెటర్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ కి రోడ్డు ప్రమాదం జరిగింది. రూర్కి దగ్గర పంత్ కారు అదుపు తప్పి డివైడర్ ను ఢీ కొట్టింది. ప్రమాదంలో రిషబ్ పంత్ కి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు రిషబ్ ను వెంటనే దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించారు.
Advertisement
ప్రమాదం అనంతరం కారులో మంటలు చెలరేగాయి. మంటల్లో కారు పూర్తిగా దగ్ధమైంది. ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. మంటలు చెలరేగిన సమయంలో పంత్ కారులో లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. రూర్కి నుంచి ఢిల్లీకి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
Advertisement
ఈ ప్రమాదంపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా ఇటీవల బంగ్లాదేశ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లో ఇండియా నెగ్గిన విషయం తెలిసిందే. ఆ జట్టులో పంత్ కూడా ఉన్నారు. ఆ సిరీస్ లో 46, 93 రన్స్ స్కోర్ చేశాడు. అతను కొన్ని రోజుల క్రితం క్రిస్మస్ వేడుకల్ని పంత్ దుబాయ్ లో జరుపుకున్నాడు. కెప్టెన్ ధోని, అతని ఫ్యామిలీతో పాటు ఆ సెలబ్రేషన్ లో ఉన్నారు. ధోని భార్య సాక్షి ఆ ఫోటోలను షేర్ చేసింది.
Get Well Soon Rishabh Pant💜#Rishabpant pic.twitter.com/d3gNHRanin
— Rasul Jaansum786 (@Rasuljaansum111) December 30, 2022