Home » IND vs ENG: అబుదాబి కి ఇంగ్లాండ్ జట్టు.. ఎందుకంటే..?

IND vs ENG: అబుదాబి కి ఇంగ్లాండ్ జట్టు.. ఎందుకంటే..?

by Sravya

హైదరాబాదులోని తొలి టెస్ట్ లో ఓటమికి విశాఖలో భారత్ ప్రతికరం తీర్చుకుని ఇంకో రోజు మిగిలి ఉండగానే ముగిసిన రెండో టెస్ట్లో టీమిండియా 106 పరుగులు తేడాతో ఇంగ్లాండు ని చిత్తుగా ఓడించింది. 399 పరుగుల టార్గెట్ తో ఇంగ్లాండ్ జట్టు బారి లోకి దిగి 292 పరుగులు చేసి అలౌట్ అయ్యింది. ఈ విజయంతో ఐదు టెస్టుల సిరీస్ 1 – 1తో సమానం అయింది మూడవ టెస్ట్ ఫిబ్రవరి 15న రాజ్కోట్ లో ప్రారంభం కాబోతోంది. అయితే ఈ టెస్ట్ కి ముందు ఇంగ్లాండ్ జట్టు అబుదాబి కి వెళ్లబోతోంది.

మూడో టెస్ట్ కి దాదాపు పది రోజులు గ్యాప్ వచ్చింది ఈ కారణంగానే ఇంగ్లాండ్ టీం అబుదాబికి వెళ్లునుంది. అబుదాబిలో ఇంగ్లాండ్ టీం విశ్రాంతి తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇంగ్లాండ్ టీం ప్లేయర్లు కుటుంబ సభ్యులు కూడా అబుదాబికి చేరుకున్నట్లు సమాచారం. రెండు మూడు రోజుల విశ్రాంతి తర్వాత మూడవ టెస్ట్ కోసం ఇంగ్లాండ్ జట్టు ప్రాక్టీస్ చేయబోతోంది. స్పిన్ ట్రాక్ ని ఏర్పాటు చేసి ప్రాక్టీస్ చేయబోతున్నట్లు తెలుస్తోంది ఇక్కడ ఇంగ్లాండ్ ప్లేయర్లు గోల్ఫ్ కూడా ఆడబోతున్నట్లు తెలుస్తోంది ఫిబ్రవరి 13 నేరుగా రాజ్కోట్ కి చేరుకుంటారు.

స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading