టాలీవుడో డిస్ట్రిబ్యూటర్ గా, నిర్మాతగా, ఎగ్జిగ్యూటర్ గా ఎంతో గుర్తింపు తెచ్కుకున్న ఒకేఒక్క వ్యక్తి కేవీబీ సత్యనారాయణ. ఈయన విక్టరీ వెంకటేష్ హీరోగా వరుసగా ఒకే ఏడాది రెండు సినిమాలను నిర్మించారు. అంతే కాకుండా ఈ రెండు సినిమాలు కూడా రీమేక్ సినిమాలే కావడం విశేషం. వాటిలో ఒకటి కొండపల్లి రాజా కాగా మరో సినిమా సుందరకాండ. సుందరకాండ సినిమాకు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న సమయంలో మద్రాస్ వెళ్లిన రాఘవేంద్రరావు రజినీకాంత్ హీరోగా నటించిన అన్నమలై సినిమాను చూశారు.
Advertisement
ఈ సినిమా అక్కడ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దాంతో ఈ సినిమా రీమేక్ హక్కుల కోసం టాలీవుడ్ లో భారీగా పోటీ ఏర్పడింది. అయితే ఈ సినిమా నిర్మాత కేవీబీ సత్యనారాయణకు కూడా చాలా నచ్చింది. దాంతో ఆయన డబ్బుల కోసం ఆలోచించకుండా భారీ మొత్తాన్ని ఖర్చుచేసి రీమేక్ రైట్స్ ను సొంతం చేసుకున్నారు. ఈ సినిమాను మెగాస్టార్ చిరంజీవితో చేయాలనుకున్నారు. అంతే కాకుండా ఈ సినిమా హక్కులు సొంతం చేసుకుని ఫ్లైట్ లో మద్రాసు నుండి వస్తున్న సత్యనారాయణకు అదే ఫ్లైట్ లో చిరంజీవి కలిసారు.
Advertisement
దాంతో కథను కూడా ఫైట్ లోనే వినిపించారు. కథ నచ్చడంతో మెగాస్టార్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దాంతో నిర్మాత సత్యనారాయణ కుషీ అయ్యారు. హైదరాబాద్ చేరుకున్న తరవాత సుందరకాండ సినిమా షూటింగ్ స్పాట్ కు వెళ్లారు. అయితే ఈ విషయం తెలిసిన వెంటనే విక్టరీ వెంకటేష్ ఆ సినిమా కూడా మనమే చేద్దామని అన్నారు. దాంతో సత్యనారాయణ షాక్ అయ్యారు. వెంకటేష్ మరో సినిమా చేసేందుకు ఒప్పుకున్నాడని సంతోషించాలో…మెగాస్టార్ తో ఛాన్స్ మిస్ అవుతున్నందుకు బాధపడాలో అర్థం కాలేదు.
కానీ చివరికి రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో కొండపల్లి రాజా సినిమా చేసి హిట్ అందుకున్నాడు. ఇదిలా ఉండగా ఓ నవల ఆధారంగా 1987లో హిందీలో ఉదాగస్ సినిమా తెరకెక్కింది. ఇక ఈ సినిమా ఆధారంగా రెబల్ స్టార్ కృష్ణం రాజు తెలుగులో ప్రాణస్నేహితులు అనే సినిమా చేశారు. ఇక ఈ సినిమా ఆధారంగా తమిళంలో అన్నమలై తెరకెక్కింది. మళ్లీ ఈ సినిమా రీమేక్ గా కొండపల్లి రాజా తెరకెక్కింది. ఈ విషయం తెలిసిన కృష్ణం రాజు కేసువేశారు. దాంతో నిర్మాత సత్యనారాయణ జైలుకు వెళ్లే వరకూ వెళ్లింది. కానీ చాలా కష్టపడి ఈ కేసు నుండి తప్పించుకుని ఆయన హిట్ కొట్టారు.
Also read :
“ఎక్కడున్నా స్వర్గం వెతుక్కుంటా” అంటూ మెగాడాటర్ పోస్ట్… ఓ రేంజ్ లో కామెంట్స్ చేస్తున్న నెటిజన్లు..!