Home » బ్రిట‌న్ ప్ర‌ధాని రిషిసునాక్ భార్య ఎవ‌రో తెలుసా..? ఎలా ఒక్కటయ్యారంటే..?

బ్రిట‌న్ ప్ర‌ధాని రిషిసునాక్ భార్య ఎవ‌రో తెలుసా..? ఎలా ఒక్కటయ్యారంటే..?

by AJAY
Ad

బ్రిటన్ దేశానికి భారత సంతతి వ్యక్తి రిషి సునాక్ ప్రధానిగా ఎన్నికైన సంగ‌తి తెలిసిందే. దాంతో రిషి సునాక్ కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. రిషి సునాక్ పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకునేందుకు నెటిజన్లు తెగ‌ ఆసక్తి చూపిస్తున్నారు. రుషి సునాక్ భార్య మరెవరో కాదు. ఇన్ఫోసిస్ అధినేత నారాయణమూర్తి కూతురు అక్షరామూర్తి.

Advertisement

అక్షరా మూర్తి బెంగళూరులోనే జన్మించారు. బెంగళూరులోని బాల్డ్ విన్ గర్ల్స్ హైస్కూల్ లో అక్షరమూర్తి చదువుకున్నారు. స్కూల్లో అక్షరామూర్తి చాలా సింపుల్ గా ఉండేవారు. స్కూల్ ఎడ్యుకేషన్ పూర్తయిన తర్వాత కాలిఫోర్నియాలో ఎకనామిక్స్ మరియు ఫ్రెంచ్ చదువుకున్నారు. ఆ తర్వాత అక్షరామ్మూర్తి లాస్ ఏంజిల్స్ లో ఫ్యాషన్ డిజైనింగ్ లో డిప్లమా కోర్సును పూర్తి చేశారు.

Advertisement

అంతేకాకుండా ఆ తర్వాత స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో ఎంబీఏ చదువుకున్నారు. స్టాన్ ఫర్ట్ యూనివర్సిటీలో ఎంబీఏ చదువుతున్న సమయంలోనే అక్షరామ్మూర్తికి రిషి సునాక్ తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త కొంతకాలానికి ప్రేమగా మారింది. దాంతో వీరిద్దరూ కుటుంబాన్ని ఒప్పించి 2009లో వివాహం చేసుకున్నారు. వీరి వివాహం కూడా బెంగళూరులో కుటుంబ సభ్యుల మధ్య జరిగింది.

రిషి అక్షరామూర్తి దంపతులకు ఇద్దరు అమ్మాయిలు జన్మించారు. వారి పేర్లు కృష్ణ, అనౌష్క కాగా ప్రస్తుతం ఇద్దరూ చదువుకుంటున్నారు. ఇక ఇక అక్షరామూర్తి రిషి బ్రిటన్ ప్రధాని అయ్యేందుకు ఎంతో సహకరించారు. ఆయన వెన్నంటే ఉండి నడిపించారు. అక్షరామూర్తి ఐటితో పాటు ఫ్యాషన్ డిజైనింగ్ రంగంలోనూ రాణించారు. అక్ష‌రా డిజైనింగ్ పేరుతో ఓ సంస్థను స్థాపించి సక్సెస్ అయ్యారు.

Visitors Are Also Reading