టీవీ సీరియల్స్ కు మనదగ్గర ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా మహిళలు టీవీ సీరియల్స్ ను ఎక్కువగా ఇష్టపడుతుంటారు. మద్యాహ్నం నుండి రాత్రి వరకూ ఖాళీ సమయాల్లో సీరియల్స్ చూస్తూనే కాలక్షేపం చేస్తుంటారు. అంతే కాకుండా చాలా మంది సిరియల్స్ లో ధరించే దుస్తులను, వాళ్లు వేసుకునే జ్యూవెలరీని గమనిస్తూ అలాంటివే కొనుక్కోవాలని కూడా అనుకుంటారు.
Advertisement
అలంకరణపై ఎక్కువగా దృష్టి పెట్టే మహిళలు మాత్రం సీరియల్ లోని కథ అందులోని ఎమోషన్స్ చూడటం కంటే ఏ నటి ఎలాంటి చీర కట్టుకుంది..ఎలాంటి నగలు పెట్టుకుంది అన్నదే పరిశీలిస్తారు. ఇక సీరియల్స్ చూపించే చీరలు, వాళ్లు వేసుకునే జ్యువెలరీ అంత అట్రాక్టివ్ గా ఉంటాయి మరి. అంతే కాకుండా సీరియల్స్ అస్సలు లాజిక్స్ ఉండవు. అర్దరాత్రి సీన్ అయినా సరే నటీమణులు మేకప్ తో ఒంటినిండా బంగారం వేసుకుని కనిపిస్తూ ఉంటారు.
Advertisement
అయితే సీరియల్స్ చూసే ప్రతిఒక్కరికీ అసలు ఇంత జ్యువెలరీ మరియు రంగురంగుల చీరలను అసలు ఏం చేస్తారు అనే డౌట్ వస్తుంది. అంతే కాకుండా ఒక సీరియల్ లో నటి కట్టుకున్న చీరలు మళ్లీ పెద్దగా కనిపించవు. దాంతో ఆ చీరలను, జ్యువెలరీని పడేస్తారా అని కూడా కొంత మందికి డౌట్ వస్తుంది. అయితే దానిపై ఓ నటి తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. సీరియల్స్ కట్టేచీరలు కొన్ని నిర్మాతలే ఇస్తారని తెలిపారు.
అంతే కాకుండా కొన్ని సార్లు తామ సొంత చీరలతోనే షూటింగ్ కు వస్తామని అన్నారు. అదే విధంగా జ్యువెలరీ కూడా కొన్నిసార్లు తమవే వేసుకుంటామని కొన్ని సార్లు సీరియల్ వాళ్లే ఇస్తారని తెలిపారు. ఇక సీరియల్ వాళ్లు ఏర్పాటు చేసిన చీరలను అదే సీరియల్ లో వాడితే చాలా ఎపిసోడ్ ల తరవాత ధరిస్తామని చెప్పారు. అంతే కాకుండా ఆ చీరలను వేరే సీరియల్స్ కు కూడా వినియోగిస్తామని తెలిపారు.
ALSO READ :
సర్కారు వారి పాట తొలుత ఆ స్టార్ హీరో కోసమే సిద్ధం చేశారా..?
గిరిబాబు రెండో కుమారుడు కూడా నటుడే అన్న సంగతి తెలుసా..? ఎవరంటే..!