రీసెంట్ గా జరిగిన టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 పేపర్ లీకేజీ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని నిరుద్యోగులు ఉద్యోగం కోసం ఎంతో కష్టపడి చదువుతుంటే పేపర్ లీక్ అవ్వడం వారిని ఆందోళనకు గురిచేస్తోంది. ఇక ప్రతిపక్షాలు ఈ ఘటన పై మండిపడుతున్నాయి. టీఎస్పీఎస్సీని ముట్టడించడంతో పాటూ సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నాయి.
also read : Mohanbabu:నేను సొంత బ్యానర్ పెట్టడం ఆయనకి ఇష్టం లేదు.. కారణం ఏంటంటే..?
Advertisement
మరోవైపు ఈ ఘటన పై సిట్ విచారణ ప్రారంభం అయ్యింది. ఇక ఈ ఘటనకు పాల్పడిన ఇద్దరిలో ఒకరు ప్రవీణ్ కాగా మరొకరు రేణుక. ప్రవీణ్ టీఎస్పీఎస్సీ ఉద్యోగి కాగా రేణుక గురుకుల టీచర్. దాంతో గురుకుల టీచర్ ఇంతపెద్ద స్కామ్ కు ఎలా తెరలేపింది. అసలు రేణుక ఎవరు ఆమె బ్యాగ్రౌండ్ ఏంటి అని ఆరాతీయడం మొదలు పెట్టారు. గురుకుల మహబూబ్ నగర్ జిల్లా వాసి కాగా 2018లో గురుకుల స్కూల్ లో హిందీ పండిట్ ఉద్యోగాన్ని సంపాదించుకుంది.
Advertisement
ప్రస్తుతం వనపర్తిలో టీచర్ గా పనిచేస్తుంది. ఇక రేణుకకు ఇప్పటికే వివాహం కాగా భర్త మరియు పిల్లలు ఉన్నారు. ఇక రేణుక తన తమ్ముడికి అర్హత లేకపోయినప్పటికీ ఏఈ పరీక్ష రాసేందుకు సెట్ చేసేలా ప్రవీణ్ తో బేరసారాలు ఆడింది. అంతే కాకుండా తమ గ్రామానికి చెందిన శ్రీనువాసులు అనే యువకుడు ప్రస్తుతం కానిస్టేబుల్ ఉద్యోగం చేస్తుండగా అతడికి ఎస్సై ఉద్యోగం ఇప్పిస్తానని ఆశ చూపించింది.
కానీ అతడు మాత్రం రేణుకకు నో చెప్పాడు. కానీ తమ పై అధికారులకు అసలు విషయం చెప్పకపోవడంతో అతడిని సైతం విచారిస్తున్నారు. ఇక రేణుక ద్వారా ప్రవీణ్ కు పలువురు ఆశావహులతో పరిచయాలు ఏర్పడినట్టు తెలుస్తోంది. వారి నుండి భారీగా డబ్బులు వసూళు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు ప్రవీణ్ కు లేడీస్ వీక్ నెస్ ఉండటం కూడా పోలీసులు గుర్తించారు.
ALSO READ: Niharika-Chaitanya : పెళ్లి ఫోటోలతో సహా అన్ని ఫోటోలు డిలీట్.. ఆ ఒక్కటి తప్పా..!