హీరో అబ్బాస్ ఇండస్ట్రీలో పరిచయం అక్కర్లేని పేరు. ముఖ్యంగా నైన్టీస్ జనరేషన్ వాళ్లకు అబ్బాస్ ఎక్కువగా తెలుసు. లవర్ బాయ్ గా అబ్బాస్ ఎంతో గుర్తింపు తెచ్చుకున్నాడు. యూత్ కు ఫ్యాషన్ ఐకాన్ గా నిలిచాడు. అమ్మాయిలకు కూడా అబ్బాస్ రాకుమారుడుగా మారిపోయాడు. అంతే కాకుండా అబ్బాస్ ప్రేమదేశం సినిమాతో యూత్ ను తనవైపు తిప్పుకున్నాడు. అబ్బాస్ కటింగ్ కూడా దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యింది. చెవుల వద్ద చిన్నగా మిలటరీ హెయిర్ స్టైల్ మాదిరిగా కనిపించే అబ్బాస్ స్టైల్ ఎంతో ఫేమస్ అయ్యింది.
also read : ప్రేమదేశంలో అబ్బాస్‌కు ఛాన్స్ ఏ విధంగా వచ్చిందో తెలుసా..?
Advertisement
1996లో విడుదలైన ప్రేమ దేశం సినిమా రికార్డులు క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలు ఈ సినిమా స్పెషల్ షోలు వేయించుకుని కలిసి చూశారు. ఈ సినిమాలో నటించిన మరో హీరో వినీత్ కూడా ఎంతో ఆకట్టుకున్నాడు. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ గా టబు నటించి అలరించింది. కానీ అందరికంటే ఎక్కువ పేరు మాత్రం అబ్బాస్ కు వచ్చింది. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ అందించిన స్వరాలు హైలెట్ గా నిలిచాయి.
Advertisement
అంతే కాకుండా ఈ సినిమాకు కదీర్ దర్శకత్వం వహించగా కోటి రూపాయల రెమ్యునరేషన్ ఇస్తామని ఏఆర్ రెహమాన్ ను ఒప్పించారట. ప్రేమదేశం సినిమా తరవాత అభిమానులు అబ్బాస్ ఇంటి ముందు ఆటో గ్రాఫ్ ల కోసం ఎగబడేవారు. అంతే కాకుండా దర్శకనిర్మాతలు సైతం సినిమాల కోసం అబ్బాస్ ఇంటికి క్యూ కట్టారు. దాంతో రెండేళ్ల పాటూ సరిపడా సినిమాలకు అబ్బాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కానీ స్టార్ ఇమేజ్ వచ్చిన అబ్బాస్ రెండో సినిమాకే పతనం అవ్వడం మొదలయ్యాడు.
అబ్బాస్ నటించిన వీఐపీ సినిమా అనుకున్నమేర విజయం సాధించలేదు. కథలను వినకుండా డబ్బుకోసం వచ్చిన ఆఫర్లన్నింటికీ ఓకే చెప్పాడు. అలాంటి సమయంలో శంకర్ జీన్స్ కథతో అబ్బాస్ వద్దకు రాగా డేట్స్ కాళీగా లేవని నో చెప్పాడు. మరికొన్ని సినిమాలను కూడా అబ్బాస్ మిస్ చేసుకున్నాడు. చివరికి సినిమాల్లో చిన్న పాత్రలు..సీరియల్స్ చేయడం మొదలు పెట్టాడు. కానీ ఇక్కడ అవమానాలు భరించలేక ఓ డిజైనర్ ను పెళ్లి చేసుకుని స్విట్జర్లాండ్ కు వెళ్లిపోయాడు. ప్రస్తుతం అక్కడే వాపారం చేస్తూ సెటిల్ అయ్యాడు.