అక్కినేని నాగార్జున నటవారసులుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన హీరోలు అఖిల్, నాగచైతన్య. ప్రస్తుతం వీరిద్దరూ వరుస పెట్టి సినిమాలు చేస్తున్నారు. అయితే అఖిల్ మాత్రం ఇప్పటికీ హిట్ పడకపోవడంతో ఇండస్ట్రీలో సతమతం అవుతూనే ఉన్నాడు. ప్రస్తుతం అఖిల్ సురేందర్ రెడ్డి సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో అఖిల్ డిఫరెంట్ లుక్ లో కనిపిస్తున్నాడు.
Advertisement
అంతే కాకుండా సురేందర్ రెడ్డికి హిట్ ట్రాక్ ఎక్కువ ఉండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాకు ఏజెంట్ అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఇక చైతూ విషయానికి వస్తే ఇటీవలే లవ్ స్టోరీ, బంగార్రాజు సినిమాలతో హిట్ అందుకున్నాడు. అంతే కాకుండా ఓ బాలీవుడ్ ప్రాజెక్టులోనూ నటించారు. ఇదిలా ఉంటే వీరిద్దరూ అక్కినేని వారసులు అయినప్పటికీ వీరిద్దరి తల్లులు వేరు అన్న సంగతి తెలిసిందే.
Advertisement
అఖిల్ అమల కుమారుడు కాగా చైతూ నాగార్జున మొదటి భార్య లక్ష్మి కుమారుడు. అయినప్పటికీ ఇద్దరూ అక్కినేని కుటుంబంలోనే పెరిగారు. అంతే కాకండా ఇద్దరూ కలిసిమెలిసి ఉంటారు. ఒకరి సినిమాలను మరొకరు సపోర్ట్ చేసుకుంటారు. ఇదిలా ఉండగా ఎవరికీ తెలియని నిజం ఏంటంటే చైతూకు మరో తమ్ముడు కూడా ఉన్నాడు. అయితే అక్కినేని వారసుడు మాత్రం కాదు. చైతూ తల్లి, రామానాయుడు కుమార్తె లక్ష్మి నాగార్జున తో విడిపోయిన తరవాత మరో వివాహం చేసుకుంది.
ఆయన చెన్నై లో బడా వ్యాపారవేత్త కాగా ఆయన పేరు శరత్ రాఘవన్. ఇక చిన్నతనంలో కొన్నేళ్ల పాటూ చైతూ తన తల్లి దగ్గరే పెరిగాడు. ఆ తరవాత నాగార్జున వద్దకు వచ్చాడు. ఇదిలా ఉంటే లక్ష్మీ రాఘవన్ లకు మరో కుమారుడు కూడా ఉన్నాడు. చైతన్యకు అతడు తమ్ముడు అవుతాడు. కానీ ఈ విషయం చాలా మందికి తెలియదు. కొన్నేళ్ల కిందట అతడి పెళ్లి జరగగా ఆ పెళ్లికి నాగచైతన్య సమంతలు హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలు అప్పట్లో వైరల్ అయ్యాయి.
ALSO READ :
లోలో ఏకాంతం, నా చుట్టూ అల్లిన లోకం..అద్భుతమైన Life Of Ram సాంగ్ లిరిక్స్