Home » పాకిస్థాన్ థార్ ఎడారిలో ఏకైన డోలు క‌ళాకారిని మ‌రియం నాజ్..!

పాకిస్థాన్ థార్ ఎడారిలో ఏకైన డోలు క‌ళాకారిని మ‌రియం నాజ్..!

by AJAY

పాకిస్థాన్ థార్ ఎడారిలో ఒకే ఒక్క మ‌హిళా డోలు క‌ళాకారిని మ‌రియం నాజ్. త‌న భ‌ర్త చ‌నిపోయిన త‌ర‌వాత మ‌రియం నాజ్ కుటుంబం కోసం డోలు క‌ళాకారినిగా మారింది. అయితే ఆ ప్రాంతంలో అస‌లు మ‌హిళ‌లు బ‌య‌ట‌కు వెళ్ల కూడ‌దు. కానీ మ‌రియం నాజ్ కు డోలు వాయించ‌డం త‌ప్ప మ‌రొక‌టి తెలియ‌దు. మొద‌ట కుటుంబంలోని మ‌గ‌వాళ్లు మ‌రియం నాజ్ డోలు వాయించ‌డానికి ఒప్పుకోలేదు. అంతే కాకుండా త‌మ కుటుంబంలో స్త్రీలు మీడియా ముందుకు వెల్ల‌కూడ‌ద‌ని చెప్పార‌ట‌. దాంతో త‌న పిల్ల‌ల‌న‌ను పెంచేందుకు డ‌బ్బులు ఇస్తే తాను బ‌య‌ట‌కు వెళ్ల‌న‌ని వారితో మ‌రియం నాజ్ వాదించిన‌ట్టు చెప్పింది.

mariyam naj from pakisthan

దాంతో తాము డ‌బ్బులు ఇవ్వ‌లేమ‌ని బ‌య‌ట‌కు వెళ్లి నీకు న‌చ్చింది చేసుకో అని కుటుంబ స‌భ్యులు చెప్పార‌ట‌. దాంతో మ‌రియం నాజ్ త‌న‌కు వ‌చ్చిన ఏకైక ప‌ని డోలు వాయించ‌డం మొద‌టు పెట్టార‌ట‌. రాజస్థాన్ థార్ ప్రాంతాల‌లో మాంగనీయ‌ర్ కుటుంబాలు శ‌తాబ్దాలుగా సంగీతాన్నే జీవ‌నాధారంగా చేసుకుని బ‌తుకుతున్నాయి. కానీ మ‌హిళ‌లు మాత్రం త‌మ‌కు టాలెంట్ ఉన్నా కూడా ఇంట్లోనే పాట‌లు పాడాలి డోలు వాయించాయి. ఉత్స‌వాల్లో వాయించ‌కూడ‌దు…బ‌య‌ట‌కు వెళ్ల కూడ‌దు. కానీ మ‌రియం త‌న‌కు తెలింసింది.

ఇదొక్కే క‌ళ అని మ‌రో పని తెలియ‌ద‌ని త‌న పిల్ల‌ల‌కు ఆహారం పెట్టాలంటే ఇదే ప‌నిచేయాల‌ని చెబుతోంది. అంతే కాకుండా థార్ సంగీత క‌ళాకారుల‌కు ఎంతో ప్ర‌తిభ ఉన్న‌ప్ప‌టికీ పేద‌రికం లోనే న‌లిగిపోతున్నార‌ని ఆమె వెల్ల‌డించారు. హార్మోనియం డోలు లాంటివి చాలా భాగా వాయించ‌గ‌ల‌మని మ‌రియం నాజ్ చెబుతున్నారు. త‌మ వ‌ద్ద ఎంతో ప్ర‌తిభ ఉన్నా త‌మ‌ను ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేద‌ని అందువ‌ల్లే పేద‌రికంలో ఉన్నామ‌ని మ‌రియం ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. తాను పెళ్లి వేడుక‌ల్లో డోలు వాయిస్తేనే త‌మకు పూట‌ గ‌డుస్తుంద‌ని మ‌రియం చెబుతున్నారు.

Visitors Are Also Reading