Home » గిరిబాబు రెండో కుమారుడు కూడా నటుడే అన్న సంగతి తెలుసా..? ఎవరంటే..!

గిరిబాబు రెండో కుమారుడు కూడా నటుడే అన్న సంగతి తెలుసా..? ఎవరంటే..!

by AJAY
Ad

టాలీవుడ్ లో గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ నటులలో గిరిబాబు కూడా ఒకరు. సినిమాలపై ఉన్న ఆసక్తితో గిరిబాబు మద్రాసుకు వెళ్లి అవకాశాల కోసం ప్రయత్నించారు. అయితే అంతకు ముందే గిరిబాబుకు నాటకాలలో నటించిన అనుభవం ఉంది. దాంతో సినిమాల్లో అవకాశాలు త్వరగానే వచ్చాయి. 1973 లో జగమే మాయ అనే సినిమాతో గిరిబాబు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత 1977లో దేవతలారా దీవించండి అనే సినిమాతో ఆయన నిర్మాతగా మారారు.

Advertisement

 

అంతేకాకుండా జయభేరి అనే నిర్మాణ సంస్థను స్థాపించి అందులో మూడు నాలుగు సినిమాలు తీశాడు. ఆ తర్వాత ఆ సంస్థను హీరో మురళీమోహన్ కు అప్పగించారు. అనంతరం గిరిబాబు విలన్ గా, కమెడియన్ గా అనేక పాత్రలు చేస్తూ ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. మొత్తం 500లకు పైగా సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించారు. అయితే అందులో సూపర్ స్టార్ కృష్ణ హీరోగా నటించిన సినిమాలు 150 ఉండటం విశేషం. ఇదిలా ఉంటే గిరిబాబు కు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.

Advertisement

వారిలో మొదటి కుమారుడు రఘుబాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రఘుబాబు కూడా టాలీవుడ్ లో నటుడుగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్నాడు. విలన్ గా కమెడియన్ గా హీరో హీరోయిన్లకు తండ్రి పాత్రలు వేస్తూ తనకంటూ ఒక ఇమేజ్ ను సంపాదించుకుని తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్నాడు. ఇదిలా ఉంటే గిరిబాబు కు మరొక కుమారుడు కూడా ఉన్నాడు.

అతని పేరే బోసు…. బోసు బాబు హీరోగా మూడు సినిమాలు చేశాడు. కానీ ఇప్పటి ప్రేక్షకులకు ఆయన పెద్దగా పరిచయం లేదు. బోసు బాబు హీరోగా ఇంద్రజిత్ అనే సినిమా చేశాడు. ఈ సినిమాలో కౌబాయ్ గా నటించాడు. ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది. ఈ చిత్రం తర్వాత చమ్మచక్క అనే మరో సినిమా కూడా చేశాడు. ఆ తరవాత స్టంట్ మాన్ అనే సినిమా చేశాడు. ఈ సినిమా అనుకున్న మేర విజయం సాధించలేదు. ఆ తర్వాత బోసు బాబు సినిమాలకు దూరం అయ్యాడు.

Visitors Are Also Reading