సినిమా హిట్ అవ్వాలంటే ఆ సినిమాలో కథతో పాటూ సందర్భాన్ని బట్టి వచ్చే పాటలు కూడా బాగుండాలి. నిజానికి సినిమాకు ప్రేక్షకులను రప్పించడంలో పాటలు చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. దానికి కారణం సినిమా విడుదలకు ముందే ఆ సినిమా పాటలను విడుదల చేస్తారు. ఇక ఆ పాట శ్రోతల హృదయాలను దోచుకోవాలంటే మ్యూజిక్ డైరెక్టర్ తో పాటూ రచయిత గొప్పపదాలతో రచించాలి. అలా టాలీవుడ్ లోని టాప్ పాటల రచయితలలో చంద్రబోస్ కూడా ఒకరు. ఇయన ఎన్నో గొప్ప పాటలను రచించి శ్రోతల మసను దోచుకున్నారు.
Advertisement
టాలీవుడ్ లోని స్టార్ హీరోల సినిమాలకు చంద్రబోస్ పాటలు రాస్తుంటారు. చంద్రబోస్ రాసే పాటల్లో ఎంతో అర్థం ఉంటుంది. దాంతో ఆయనకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అయితే చంద్రబోస్ పాటల గురించి చాలా మందికి తెలుసు కానీ ఆయన పర్సనల్ లైఫ్ గురించి మాత్రం చాలా తక్కువ మందికి తెలుసు. చంద్రబోస్ వరంగల్ లో జన్మించగా హైదరబాద్ లో ఇంజనీరింగ్ చదువుకున్నాడు.
Advertisement
ముందు నుండి సాహిత్యం పై ఉన్న ఇష్టంతో మొదట తన స్నేహితుడి ద్వారా తాజ్ మహల్ అనే సినిమా కోసం పాటను రాసే అవకాశం అందుకున్నాడు. ఆ తరవాత రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన పెళ్లి సందడి సినిమాలో పాటలు రాసే ఛాన్స్ వచ్చింది. ఈ సినిమాలో చంద్రబోస్ పాటలకు శ్రోతలు ఫిదా అయ్యారు. ఆ తరవాత వరుస ఆఫర్ లు అందుకున్నాడు. ఇదిలా ఉంటే చంద్రబోస్ కొరియోగ్రాఫర్ సుచిత్రను వివాహం చేసుకున్నాడు. వీరిద్దరూ కలిసి పెళ్లి పీటలు అనే సినిమాకు కలిసి పనిచేశారు.
ఈ సినిమా కోసం ఇద్దరూ కలిసి హైదరాబాద్ నుండి చెన్నైకి విమానంలో పక్క పక్క సీట్ లో కూర్చుని ప్రయాణం చేశారు. ఆ సమయంలో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడిందట. కొంతకాలానికి చంద్రబోస్ ప్రపోస్ చేయగా సుచిత్ర రిజెక్ట్ చేశారట. కానీ చంద్రబోస్ తన ప్రేమను వివరించడంతో సుచిత్ర కూడా ఓకే చెప్పారు. ఇక కెరీర్ విషయంలో సుచిత్ర చంద్రబోస్ కంటే ఆరేళ్లు సీనియర్ కావడం విశేషం.