Home » ఎప్పుడూ భ‌ర్త వెనువెంటే…చావులోనూ అంతే..!

ఎప్పుడూ భ‌ర్త వెనువెంటే…చావులోనూ అంతే..!

by AJAY
Ad

ఆర్మీలో 42ఏళ్ల‌పాటూ సేవ‌లు అందించిన గొప్ప‌సైనికుడు బిపిన్ రావ‌త్ ను భార‌త్ కోల్పోయింది. ఎన్నో పోరాటాల‌ను బిపిన్ రావ‌త్ ముందుండి న‌డిపించారు. ధైర్య‌శీలి అయిన బిపిన్ మ‌ర‌ణ‌వార్త యావ‌త్ భార‌తావ‌నిని కంట‌త‌డి పెట్టించింది. ఈ ప్ర‌మాదంలో బిపిన్ రావ‌త్ తో పాటూ ఆయ‌న స‌తీమ‌ణి మ‌ధులిక కూడా క‌న్నుమూశారు. బిపిన్ రావ‌త్ తో మ‌ధులిక‌కు 1985లో వివాహం జ‌రిగింది. ఎప్పుడు చూసినా బిపిన్ ప‌క్క‌నే ఉండే ఆయ‌న భార్య మ‌ధులిక మ‌ర‌ణంలోనూ ఆయ‌న‌కు తోడున్నారు. మిగ‌తా ఉద్యోగాలు వేరు ఆర్మీ వేరు. ఆర్మీలో ప‌నిచేసేవాళ్ల కుటుంబం త‌మ వారు ఎప్పుడూ బిజీగా ఉండ‌టం వ‌ల్ల వారితో స‌రిగ్గా గ‌డ‌ప‌లేకపోతారు.

Advertisement

Advertisement

ముఖ్యంగా జీవిత భాగ‌స్వాములు ఎక్కువ బాధ‌ను అనుభ‌విస్తారు. కొంత‌మంది అర్థం చేసుకుంటే మ‌రికొంద‌రు మాత్రం చిర్రుబుర్రులాడ‌తారు. కానీ మ‌ధులిక మాత్రం త‌న భ‌ర్త బిపిన్ రావ‌త్ ను ఎంత‌గానో అర్థం చేసుకునేది. ఆయ‌న‌కు కెరీర్ ప‌రంగా ఎంతో స‌పోర్ట్ చేసేది. అంతే కాకుండా ఆర్మీలో మ‌ర‌ణించిన వారి భార్య‌ల‌కు మ‌ధులిక అండ‌గా ఉండేవారు. మ‌ధులిక దేశంలోనే అతిపెద్ద ఎన్జీఓ ఆర్మీ వైఫ్స్ వెల్పేర్ అసోసియేష‌న్ ను స్థాపించి ఎంతో మందికి ఆ ట్ర‌స్ట్ ద్వారా సాయం చేసారు.

ఈ ఎన్టీఓ ద్వారా ఆర్మీలో మ‌ర‌ణించిన వారి భార్య‌లు త‌మ పిల్ల‌ల‌ను పోశించుకోవ‌డం కోసం జీవితంలో నిల‌బ‌డ‌టం కోసం వారికి టైల‌రింగ్, చాక్లెట్ల త‌యారీ లాంటి ప‌నుల‌ను నేర్చించే ఏర్పాట్లు చేశారు. అలా భ‌ర్త దేశ సేవ ప్ర‌త్యక్షంగా చేస్తుంటే ప‌రోక్షంగా మ‌ధులిక దేశ సేవ చేశారు. ఇక బిపిన్ రావ‌త్ మ‌ధులిక జంట‌కు ఇద్ద‌రు కుమార్తెలు ఉన్నారు. త‌ల్లిదండ్రుల‌ను ఒకేసారి కోల్పోవ‌డంతో వారి బాధ వ‌ర్న‌ణాతీత‌మ‌నే చెప్పాలి. బిపిన్ రావ‌త్ మ‌ధులిక మ‌ర‌ణ‌వార్త విని వారి కుటుంబ సభ్యులే కాకుండా యావ‌త్ దేశంలోని ప్ర‌జ‌లు బాధ‌ప‌డుతున్నారు.

Visitors Are Also Reading