ఆ ఏడాది ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లిన ఆస్ట్రేలియా వాళ్ళను సొంతగడ్డ పైనే ఓడించింది. దీనిపై అక్కడి మీడియా క్రికెట్ చచ్చిపోయిందని శరీరాన్ని కాల్చి బూడిదను ఆస్ట్రేలియాకు తీసుకువెళ్లారని టైం పత్రిక పెద్ద ఎత్తున అప్పట్లో రాసింది. ఆ తర్వాత అదే ఏడాది చివరలో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్ళిన ఇంగ్లాండ్ కెప్టెన్ బ్లేగ్ ఆ బూడిదతో పాటు ఇంగ్లీష్ క్రికెట్ గౌరవాన్ని కూడా తిరిగి తీసుకువస్తానని ప్రతిజ్ఞ చేశాడు. 1882-83 లో ఓ మ్యాచ్ లో మహిళల బృందం ఆ చిన్న కప్ లో బూడిద వేసి ఇచ్చారు.
Advertisement
Advertisement
ఆ బూడిద ఇంగ్లాండ్ జట్టు ఓడిపోయిన మ్యాచ్ లో స్టంప్స్ పై వాడిన ఓ బెయిల్ ది అని చెబుతూ ఉంటారు. ఈ ఘటన ఓ పెద్ద బూడిద సంగ్రామంగా దారితీసింది. ఆ తర్వాత యాషెస్ ఇరుదేశాలకు పరువు ప్రతిష్టతలకు ముడి పెట్టడంతో అది కాస్త ప్రతిష్టాత్మక సిరీస్ గా మారిపోయింది. ప్రతి రెండేళ్లకోసారి ఇంగ్లాండ్ – ఆస్ట్రేలియా ఆతిథ్యం ఇస్తున్నాయి.