యాంకర్ సుమ ప్రస్తుతం టాలీవుడ్ లోనే టాప్ యాంకర్ గా ఉన్నారు. క్యాష్, స్టార్ మహిళ లాంటి టివి షోలకు వేల ఎపిసోడ్ లకు యాంకర్ గా వ్యవహరించారు. అంతే కాకుండా మరికొన్ని టివి షోలకు కూడా సుమ యాంకర్ గా వ్యవహరిస్తున్నారు. కేవలం టివి షోలకు మాత్రమే కాకుండా సినిమా ఫంక్షన్ లకు కూడా సుమ యాంకర్ గా చేస్తుంటారు. పెద్ద సినిమాల నుండి చిన్న సినిమాల వరకు అన్ని సినిమా ఫంక్షన్ లకు కచ్చితంగా యాంకర్ సుమ ఉండాల్సిందే. దాంతో గ్యాప్ లేకుండా సంపాదిస్తూ ఉంటారు.
Advertisement
అంతే కాకుండా రీసెంట్ గా జయమ్మ పంచాయితీ సినిమా తో సుమ నటిగా కూడా అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అయితే ఈ సినిమా అనుకున్న మేర విజయం సాధించలేకపోయింది. ఇక సుమ భర్త రాజీవ్ కనకాల కూడా నటుడి గా ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. కాగా ఈ దంపతులు కలిసి ఓ ఇంటిని నిర్మించుకున్నారు. వీళ్ళ ఇల్లు చూడ్డానికి లగ్జరీ గా ఉండటం తో సినిమా షూటింగ్ లు కూడా ఎక్కువగా జరుగుతాయి.
Advertisement
అయితే తమ కొత్త ఇంట్లోకి అడుగుపెట్టే ముందు మాత్రం సుమ రాజీవ్ కనకాల కు ఇబ్బందులు ఎదురైనట్టు తెలుస్తోంది. 2018 సంవత్సరం లోనే తమ ఇంటి నిర్మాణం పూర్తయింది. అయితే ఆ సంవత్సరం కొత్త ఇంట్లోకి అడుగుపెడదాం అనుకునెలోపే రాజీవ్ కనకాల తల్లి అనారోగ్యం తో మరణించారు. దాంతో 2019 లో ఆ ఇంట్లో అడుగుపెట్టాలని అనుకున్నారు. అయితే ఆ సమయం లో రాజీవ్ కనకాల తండ్రి నటుడు దేవ దాస్ కనకాల మృతి చెందారు. దాంతో అప్పుడు కూడా ఇంట్లోకి వెళ్ళడం ఆగిపోయింది.
ఆ తర్వాత కొంత కాలానికే రాజీవ్ కనకాల సోదరి క్యాన్సర్ తో కన్ను మూసింది. ఇవన్నీ చూసిన తరవాత రాజీవ్ కనకాల సుమ ఆందోళన చెందారట. ఇంటి వాస్తులో లోపం ఉందా …అందుకే వరుస మరణాలు చోటు చేసుకుంటున్నాయా అని అనుమానం వ్యక్తం అవ్వడం తో పండితులకు చూపించారట. అయితే అవి ఆకస్మిక మరణాలు కాదని అనారోగ్యం…..వయసు పై బడటం వల్ల సంభవించిన మరణాలు అని చెప్పారట. దాంతో సుమ రాజీవ్ ఊపిరి పీల్చుకుని మంచి ముహూర్తం చూసుకుని కొత్త ఇంట్లో అడుగుపెట్టారు. ఇప్పుడు అదే ఇంటిని షూటింగ్ లకు సైతం అద్దెకు ఇస్తున్నారు.