టాలీవుడ్ లో గుర్తిండిపోయే నటులలో సీనియర్ నటుడు రంగనాథ్ కూడా ఒకరు. బుద్ధిమంతుడు సినిమా తో రంగనాథ్ టాలీవుడ్ కు పరిచయమయ్యారు. ఆతర్వాత 300లకు పైగా సినిమాలలో హీరోగా, విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి ప్రేక్షకులను అలరించారు. 1974 సంవత్సరంలో చందన అనే సినిమాలో హీరోగా నటించి ఆకట్టుకున్నారు. ఈ సినిమాతో మంచి పేరు వచ్చినప్పటికీ కెరీర్ ప్రారంభంలోనే కుటుంబ బాధ్యతల కారణంగా సినిమాలను పక్కన పెట్టి ఉద్యోగ ప్రయత్నాలు చేశారు. బీఏ చదువుతున్న సమయంలోనే దక్షిణ మధ్య రైల్వేలో టికెట్ కలెక్టర్ గా ఉద్యోగం సాధించారు.
Advertisement
అలా కొంత కాలం సినిమాలకు దూరమయ్యారు. కాగా ప్రముఖ దర్శకుడు బాపు తెరకెక్కించిన అందాల రాముడు సినిమాలో హీరోగా నటించి ప్రేక్షకులను అలరించారు. కుటుంబ కథా చిత్రాలు ఎక్కువగా చేసిన రంగనాథ్ ఇండస్ట్రీలో పోటీ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఆ తర్వాత హీరో అవకాశాలు తగ్గుముఖం పట్టడంతో ఎలాంటి పాత్ర వచ్చినా చేస్తూ ముందుకు సాగారు.
Advertisement
అలా గువ్వల జంట సినిమా తో రంగనాథ్ రీ ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎస్ వి రంగారావు, కృష్ణ, కృష్ణంరాజు లాంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసి వారితో మంచి అనుబంధాన్ని ఏర్పరుచుకున్నారు. కేవలం సినిమాలు కాకుండా సీరియల్స్ లో కూడా నటించి రంగనాథ్ అభిమానులను సంపాదించుకున్నారు. అదేవిధంగా నటనతో పాటు రచయితగా కూడా ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు.
ఆయన రచించిన పుస్తకాలు కూడా ఉన్నాయి. ఇక సినీ చరిత్రలో తనకంటూ చెరగని ముద్ర వేసుకున్న రంగనాథ్ కొని కారణాల వల్ల ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. కాగా ఆయన ఆత్మహత్య చేసుకున్న తీరు అందర్నీ బాధింపజేసింది. అంతేకాకుండా ఆత్మహత్య చేసుకునే ముందు రంగనాథ్ తన ఇంట్లో గోడ పై బొగ్గుతో మీనాక్షి అనే అమ్మాయికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని రాసి పెట్టారు. మీనాక్షి అనే అమ్మాయి రంగనాథ్ వద్ద పని చేయగా తన కోసం పని చేసిన వ్యక్తి రుణం ఉంచుకోకూడదు అనే ఉద్దేశంతో రంగనాథ్ అలా రాసినట్టు తెలుస్తోంది.