దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఏబి డివిలియర్స్ అతి తక్కువకాలంలోనే అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అంత హడావిడిగా తాను రిటైర్ అవ్వడానికి గల కారణమేంటో తాజాగా రివీల్ చేశాడు. డివిలియర్స్ రిటైర్మెంట్ ఇచ్చే సమయానికి తీవ్రమైన కంటి సమస్యతో బాధపడ్డాడట. కుడి కంటిచూపు కోల్పోతున్న సమయంలో ఏబి డివిలియర్స్ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు.
అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ లో చివరి రెండేళ్లు కేవలం ఎడమ కన్ను మాత్రమే ఉపయోగించి ఆడాడట. తన చిన్న కొడుకు ఖాళీ మడుమ ప్రమాదవశాత్తు… ఎబి డివిలియర్స్ ఎడమ కంటికి తాగిందట. ఈ తరుణంలోనే కుడి కన్ను కూడా కనిపించకపోవడంతోనే తాను క్రికెట్ కు దూరం అయ్యానని చెప్పాడు.
Advertisement
ఈ విషయం తన కంటికి ఆపరేషన్ చేసిన డాక్టర్ విని ఆశ్చర్యపోయాడట. ఇక 420 అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ లు ఆడిన డివిలియర్స్ 20,014 పరుగులు చేశాడు. కెరీర్ లో 114 టెస్టులు, 228 వన్డేలు, 78 టీ20లు ఆడాడు. అంతేకాకుండా 184 ఐపీల్ మ్యాచ్లు ఆడాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున అత్యధికంగా 156 మ్యాచ్లు ఆడాడు.
Advertisement
మరిన్ని క్రీడల వార్తల కోసం ఇక్కడ చూడండి ! తెలుగు న్యూస్ కోసం ఇక్కడ చూడండి.