టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అయితే.. ప్రస్తుతం ప్రపంచంలోని అభిమానుల దృష్టి అంతా వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నమెంట్ మీద ఉంది. ఈ మెగా టోర్నీలో ఎలాగైనా భారత్ ను చాంపియన్గా నిలబెట్టాలని కలలు కంటున్నాడు. ఇక ఈ వరల్డ్ కప్ లో కోహ్లీ పరుగుల వరద బారిస్తాడని ఫ్యాన్స్ కూడా భావిస్తున్నారు. ఈ సమయంలోనే కోహ్లీ రిటైర్మెంట్ గురించి చెప్పి ఏబి డెవిలియర్స్ బాంబు పేల్చారు. కోహ్లీ త్వరలోనే వన్డే టోర్నీలో వీడ్కోలు పలికే ఛాన్స్ ఉందని తెలిపారు. ఏబి డెవిలియర్స్ కోహ్లీ మంచి ఫ్రెండ్స్.
ఐపీఎల్ లో ఆర్సిబి తరఫున కొన్నేళ్లపాటు కలిసి ఆడారు. ఒకరి గురించి ఒకరికి బాగా తెలుసు. అందుకే కోహ్లీ మనసులో ఉన్న మాటలను ఏబి డెవిలియర్స్ ఇలా ఉంటాయని అభిప్రాయపడ్డాడు. కోహ్లీకి ఇప్పటికే 34 ఏళ్ల వయసు వచ్చింది. ఈ వన్డే వరల్డ్ కప్ తర్వాత మళ్లీ 2027 లో వన్డే వరల్డ్ కప్ జరుగుతుంది. అప్పటికి కోహ్లీ ఉండడం కష్టమని ఏబీ డెవిలియర్స్ అభిప్రాయపడ్డాడు. ఈ ఏడాది వరల్డ్ కప్ అయ్యాక కోహ్లీ వన్డే వరల్డ్ కప్ కు రిటైర్మెంట్ ఇచ్చిన ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదని ఏబి డివిలియర్స్ తెలిపాడు. ఒకవేళ టీమ్ ఇండియా వన్డే వరల్డ్ కప్ గెలిస్తే ఈ ఫార్మాట్లో వీడ్కోలు చెప్పడానికి అదే సరైన సమయంగా భావిస్తాడని, ఇకనుంచి నేను టెస్ట్ క్రికెట్, ఐపీఎల్ మాత్రమే ఆడతాను.
Advertisement
Advertisement
నా కెరియర్ చివరి రోజులను ఎంజాయ్ చేస్తాను. ఫ్యామిలీతో ఎక్కువ సమయం గడుపుతాను అని చెబుతాడని ఎబి డెవిలియర్స్ ముందుగానే ఊహించి చెప్పారు. ఇక సెంచరీలు చేయాలి, రికార్డులను బద్దలు కొట్టాలి అని కూడా కోహ్లీకి లేదని, అతని దృష్టి అంతా వరల్డ్ కప్ ను ఎలా గెలిపించాలనే దానిపైనే ఉందని తెలిపారు. కోహ్లీ రిటైర్మెంట్ గురించి ఏబి డెవిలియర్స్ చేసిన వాక్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కోహ్లీ లేని టీం ఇండియా వన్డే జట్టును ఊహించుకోవడం చాలా కష్టంగా ఉందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కోహ్లీ తన కెరీర్ లో 111 టెస్టులు, 280 వన్డే మ్యాచ్లు, అలాగే 115 టీ20 మ్యాచ్ లు ఆడాడు.
ఇవి కూడా చదవండి
- Janhvi Kapoor : హైదరాబాద్ లో ఖరీదైన ఫ్లాట్ కొన్న జాన్వీ..ఎన్ని కోట్లో తెలుసా ?
- టీమిండియా క్రికెటర్‌తో పూజా హెగ్డే ప్రేమాయాణం.. ఆ ప్లేయర్ ఎవరంటే ?
- సిల్క్ స్మితను రజనీకాంత్ సిగరెట్ తో కాల్చాడా..అంతలా నరకం చూపించాడా ?