నిన్న మొన్నటి వరకూ సినిమాల్లో మెరిసిన హీరోయిన్ లు సినిమాలకు దూరం అవ్వగానే గుర్తు పట్టలేనంత గా మారిపోతున్నారు. ఇక కొంతమంది హీరోయిన్ లు పెళ్లి చేసుకుంటే మరికొందరు సింగిల్ గానే ఉండిపోయారు. ఇప్పుడు అలాంటి ఓ హీరోయిన్ గురించి తెలుసుకుందాం. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన సినిమా ఆది. ఈ సినిమా 2002 లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
Advertisement
ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమాకు వివి వినాయక్ దర్శకత్వం వహించగా మాస్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రం తో ఎన్టీఆర్ క్రేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ సినిమా కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ బ్లాక్ బస్టర్ సినిమాలో ఎన్టీఆర్ కు జోడిగా హీరోయిన్ కీర్తి చావ్లా నటించింది.
Advertisement
ఈ సినిమా తర్వాత కీర్తి చావ్లా కు తెలుగులో మరికొన్ని సినిమాలలో అవకాశం వచ్చింది. కానీ ఆ సినిమాలు అనుకున్నమేర విజయం సాధించలేదు. అంతే కాకుండా తెలుగు తో పాటు తమిళ, మలయాళ సినిమాల్లో కూడా నటించింది. చివరగా ఈ ముద్దుగుమ్మ 2016 లో నమిత ముఖ్యమైన పాత్రలో నటించిన ఇళమై ఊంజల్ అనే తమిళ సినిమాలో నటించింది.
ఇక ఆ తర్వాత మళ్లీ ఏ సినిమాలో కూడా ఈ బ్యూటీ నటించలేదు. అయితే సినిమా లకు దూరం అయినా కూడా కీర్తి చావ్లా పెళ్లి కూడా చేసుకోకుండా సింగిల్ గా ఉండిపోయింది. అయితే కీర్తి లేటెస్ట్ ఫోటోలు వైరల్ అవ్వడం తో ఇంతలా మారిపోయిందా అని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.
Also read : వెంకటేష్ కోసం రిజిస్ట్రేషన్ చేసిన టైటిల్ చిరంజీవికి ఎలా వచ్చిందో తెలుసా ?