ఇదేందయ్య ఇది.. ఇది నేను ఎప్పుడు చూడలేదు. బండిని ఇలా కూడా నడుపుతారా..? ముఖ్యంగా బండిని ముందలికి ఎవరైనా నడుపుతారు. కానీ రివర్స్ నడపడానికి రేస్ ఉంటదనుకున్నాడో ఏమో.. బైకును రివర్స్ నడిపి ట్రెండ్ సృష్టిస్తున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. స్కూటీని రివర్స్ నడుపుతూ పెట్రోల్ బంక్‌లో చక్కర్లు కొట్టాడు. స్కూటికీ రెండు దిక్కుల హ్యాండిల్స్ పెడితే ఎటుఅంటే అటు నడిపే సౌలభ్యం కల్పిస్తే బాగుండునేమో.. ఇతని ప్రయోగం బాగానే ఉంది. కానీ కాస్త అటు ఇటు అయితే మాత్రం మొదటికే మోసమవుతుందని చెప్పకనే చెప్పొచ్చు.
Advertisement
Advertisement
సాధారణంగా బైకు- స్కూటీ ద్విచక్ర వాహనాలను డ్రైవింగ్ చేయాలంటే హ్యాండిల్ పట్టుకుని డ్రైవ్ చేయడం మనకు తెలిసినది. కానీ సర్కస్‌లలో అయితే మాత్రం హ్యాండిల్‌పై నిలబడి తెగ విన్యాసాలు చేస్తుండటం మనం చూస్తూ ఉంటాం. కానీ ఎప్పుడు ఒకసారి మాత్రమే ప్రజలు ఆశ్చర్యపొయే విధంగా.. అరే ఇలా కూడా ఈ వాహనాలను నడుపవచ్చా అనుకునేలా చేస్తుంటారు కొందరు.
తాజాగా ఒక కుర్రాడు తన ద్విచక్ర వాహనం డ్రైవ్ చేసిన విధానం చూస్తే ఎవరైనా ఖచ్చితంగా షాక్ అవుతారు. మనందరికీ ముందుకు డ్రైవ్ చేయడం తెలుసు. కానీ ఈ కుర్రాడు వెనక్కి డ్రైవ్ చేశాడు. అదీగాక స్కూటీకి వెనక వైపు ఓ హ్యాండిల్ అమర్చి డ్రైవ్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో పై మీరు ఓ లుక్కేసి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి ఇంకెందుకు ఆలస్యం.