Home » భార్య గర్భిణీగా ఉన్నప్పుడు భర్త చేయకూడని పనులు.. కటింగ్ అస్సలు చేయించుకోవద్దు!

భార్య గర్భిణీగా ఉన్నప్పుడు భర్త చేయకూడని పనులు.. కటింగ్ అస్సలు చేయించుకోవద్దు!

by Bunty
Ad

 

 

భార్యాభర్తల బంధం చాలా గొప్పనైనది. వివాహ అనంతరం భార్యాభర్తలు తమ కుటుంబాన్ని పెంపొందించుకోవడానికి పిల్లలను కనడానికి సిద్ధమవుతారు. పిల్లలతో వారి బాధ్యత మరింత రెట్టింపు అవుతుంది. ఇక భార్య గర్భిణిగా ఉన్న సమయంలో భర్త కొన్ని బాధ్యతలను పాటించాలని చాలామంది పెద్దలు చెబుతూ ఉంటారు. భార్య గర్భిణిగా ఉన్నప్పుడు భర్త ఎలా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

భార్య గర్భవతిగా ఉన్నప్పుడు తాను కోరిన కోరికలను తీర్చడం భర్త యొక్క ధర్మం. అలా చేయడం వల్ల చిరాయిష్మంతుడగు పుత్రుడు జన్మిస్తాడట. ఒకవేళ భార్య కోరిన కోరిక కనక తీర్చకపోతే దోషము కలుగుతుంది. భార్య గర్భిణిగా ఉన్న సమయంలో భర్త చెట్టుని నరకడం, సముద్ర స్నానం చేయడం వంటి పనులు చేయకూడదు. అలాగే భర్త క్షవరము చేయించుకోకూడదు. భార్య గర్భం దాల్చిన 6 నెలల తర్వాత భర్త క్షవరము చేయించుకోరాదు. భార్య గర్భిణీగా ఉన్న సమయంలో తన బంధువులు ఎవరైనా చనిపోతే వారి శవాన్ని మోయకూడదు. భార్య గర్భం దాల్చిన అనంతరం విదేశీ ప్రయాణాలు చేయడం, అలాగే భార్యను విడిచి దూరంగా వెళ్లడం వంటి పనులు చేయకూడదు.

Advertisement

ఎల్లప్పుడూ తన భార్య పక్కనే ఉండాలి. గర్భం దాల్చిన ఏడవ నెల మొదలైనప్పటి నుంచి క్షవరం, తీర్థయాత్ర మరియు నావ మొక్కుట వంటి పనులు చేయకూడదు. గృహప్రవేశము కానీ వాస్తు కర్మ కాని చేయకూడదు. పర్వతారోహణ యుద్ధము చేయడం వంటివాటికి దూరంగా ఉండాలి. అలాగే పిండదానం వంటి పనులు కూడా చేయకూడదు. ఇలాంటి పనులు చేయడం వల్ల కడుపులో పెరిగే బిడ్డకి మంచిది కాదని మన పెద్దలు చెబుతారు.

Visitors Are Also Reading