సాధారణంగా టీ-20 క్రికెట్ అంటేనే పరుగుల వరద ఏరులై పారుతుంటుంది. బౌలర్లపై ఆధిపత్యం చెలాయించేందుకు బ్యాటర్స్ రెచ్చిపోతుంటారు. బౌలర్ ఎవరైనా బంతి ఎలా వచ్చినా భారీ షాట్లు ఆడుతుంటారు. బంతి లైన్ తప్పితే బౌండరీ ఖాయం అన్నట్టుగా హిట్టర్లు ప్రయత్నిస్తుంటారు. ఈ తరుణంలోనే కొందరూ ఆటగాళ్లు బంతిని బలంగా బాదడంతో అది కాస్త కొన్ని సందర్బాల్లో స్టేడియం అవతల కూడా పడుతుంటుంది. తాజాగా ఇంటర్నేషనల్ టీ-20 లీగ్ 2023లో అలాంటి ఘటనే జరిగింది. ఇంగ్లండ్ క్రికెటర్ డాన్ మూస్లీ బాదిన భారీ సిక్సర్ స్టేడియం బయట ఉన్నటువంటి రోడ్డుపై పడింది.
Advertisement
ఇంటర్నేషనల్ టీ-20 లీగ్ లో భాగంగా డెసర్ట్ వైపర్స్, ఎంఐ ఎమిరేట్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఎంఐ ఎమిరేట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 241 పరుగులు చేసింది. ఓపెనర్లు ఆండ్రీ ఫ్లెచర్ (50 39 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్ లు), మహమ్మద్ వసీం (86, 44 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్స్ లు) కెప్టెన్ కీరన్ పోలార్డ్ (50 నాటౌట్, 19 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్ లు) అర్ద సెంచరీతో రాణించారు. ఇక ఇన్నింగ్స్ చివరలో డాన్ మూస్లీ (31 నాటౌట్, 17 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్ లు) చేలరేగాడు.
Advertisement
Also Read : పాలలో ఆ రెండింటిని కలుపుకొని తాగితే ఆ సమస్యలకు చెక్..!
When it’s raining 6️⃣s, There are 2 types of cricket lovers..
1. Pick and run 🏃♂️
2. Pick and return
Which category are you?Book your tickets now : https://t.co/sv2yt8acyL#DPWorldILT20 #ALeagueApart #DVvMIE pic.twitter.com/P0Es01cMz8
— International League T20 (@ILT20Official) January 29, 2023
ఇంగ్లండ్ క్రికెటర్ డాన్ మూస్లీ భారీ సిక్సర్ బాదడతో బంతి షార్జా స్టేడియం బయట పడింది. స్టేడియం బయట రోడ్డు మీద పడడంతో ఇది గమనించిన ఓ వ్యక్తి పరుగెత్తుకుంటూ వెళ్లి బంతిని తీసుకున్నాడు. ఆ బంతిని చేతిలో పట్టుకొని అక్కడి నుంచి పారిపోయాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించినటువంటి వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోని చూసిన అభిమానులు, నెటిజన్లు నవ్వులు పూయిస్తున్నారు. ఆ తరువాత కీరన్ పొలార్డ్ కూడా భారీ సిక్సర్ బాదడంతో బంతి స్టేడియం బయట పడింది. ఈసారి ఓ వ్యక్తి మాత్రం బంతిని మైదానంలోకి విసిరాడు.
Also Read : అండర్-19 మహిళా టి20 ప్రపంచ కప్ విజేతగా టీమిండియా..BCCI కోట్ల వర్షం