ప్రస్తుతం ఇండస్ట్రీలో అనసూయ భరద్వాజ్ కు ఉన్న క్రేజ్ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె పేరు చెప్తే గుర్తు పట్టని వారంటూ ఉండరు.. పెళ్లై పిల్లలు ఉన్న అనసూయ ఇప్పటికి యంగ్ హీరోయిన్లకు ఏమాత్రం తగ్గకుండా పోటీ ఇచ్చే విధంగా తన అందంతో అదరగొడుతోంది.. ఒకవేళ తనను ఎవరైనా ఆంటీ అని పిలిస్తే మాత్రం లక్ష్మీ బాంబ్ లా ఫైర్ అవుతుంది. ఇక అనసూయ సోషల్ మీడియా విషయానికి వస్తే మాత్రం ఆమెను ఎవరైనా టార్గెట్ చేసి మాట్లాడితే అస్సలు తగ్గదు.. తాడోపేడో తేల్చుకుంటుంది..
Advertisement
ALSO READ:ఈ స్వభావం ఉన్న స్త్రీలను పెళ్లి చేసుకున్న పురుషుడు అదృష్టవంతుడే..!!
Advertisement
తనను అనవసరంగా విమర్శిస్తే మాత్రం అస్సలు ఊరుకోనని నా ఆత్మ గౌరవం కాపాడుకునే విషయంలో ఎక్కడికైనా వెళ్తానని చెబుతుంది.. అయితే ఈ విషయంలో జరుగుతున్న కొన్ని పరిణామాలు చూస్తే మాత్రం ఆమెను కావాలనే టార్గెట్ చేస్తున్నారని తెలుస్తోంది. తాజాగా లైగర్ రిలీజ్ రోజున సమీక్షలు అయిన తర్వాత విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ చాలా గట్టిగా టార్గెట్ చేస్తూ వచ్చారు ఆమెను. అయితే అనసూయ ఈ విషయంలో అసలు వెనక్కి తగ్గడం లేదు. మాటకు మాట అంటూ కౌంటర్ ఇస్తూ తన క్రేజ్ ను మరింత పెంచుకుంటుంది.. ఇక అనసూయ బుల్లితెరతో పాటుగా వెండితెరపై కూడా అనేక ఛాన్సులు అందిపుచ్చుకొని సక్సెస్ ఫుల్ గా ముందుకు వెళ్తోంది.
దీంతో అనసూయని చూసి ఓర్వలేక ఇండస్ట్రీలో కొంత మంది రకరకాలుగా టార్గెట్ చేస్తున్నారు అన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె వస్త్రధారణ భాష, విషయంలో ఇతర యాంకర్స్ తో పోలుస్తూ చర్చలు పెడుతున్నారు. కొందరు ఇమేజ్ దెబ్బ తీయడం కోసం నకిలీ ప్రొఫైల్స్ క్రియేట్ చేసి హ్యాష్ టాగ్స్ పెట్టి నెగెటివ్ గా ట్రెండ్ చేస్తున్నారు. ఇలా తన చుట్టూ ఏం జరుగుతున్నా అనసూయ ధైర్యంగా ఎదుర్కొంటూ వాటిని తిప్పికొట్టే ప్రయత్నం చేస్తూనే ఉంది.
ALSO READ: